PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdcf158e6-5103-4511-8a8b-57a2861c1551-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdcf158e6-5103-4511-8a8b-57a2861c1551-415x250-IndiaHerald.jpgరైతులకు శుభవార్త తెలిపాడు సీఎం కేసీఆర్. ఆరున్నార సంవత్సరాలలో 68 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 3 కోట్ల 93 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కనీస మద్దతు ధరకు తెలాంగాణ సి యస్ కొనుగోలు చెయ్యడం జరిగింది.ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలో 1 కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా యాసంగిలో కోటి 32 లక్షల ధాన్యం దిగుబడి కాబోతుంది.కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక Kcr;koti;kcr;kumaar;pragathi;hyderabad;telangana;chief minister;minister;international;nijamరైతులకి ముఖ్యమంత్రి కేసీఆర్ వరం....రైతులకి ముఖ్యమంత్రి కేసీఆర్ వరం....Kcr;koti;kcr;kumaar;pragathi;hyderabad;telangana;chief minister;minister;international;nijamSun, 11 Apr 2021 00:11:00 GMTరైతులకు శుభవార్త తెలిపాడు సీఎం కేసీఆర్. ఆరున్నార సంవత్సరాలలో 68 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 3 కోట్ల 93 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కనీస మద్దతు ధరకు తెలాంగాణ సి యస్ కొనుగోలు చెయ్యడం జరిగింది.ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలో 1 కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా యాసంగిలో కోటి 32 లక్షల ధాన్యం దిగుబడి కాబోతుంది.కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రగతి భవన్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిన సంగతి తెలిసిందే.మొత్తంగా వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి 2 కోట్ల 37 లక్షల ధాన్యం దిగుబడి అవుతుంది.

కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించిన సంగతి కూడా తెలిసిన విషయమే.


వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిని, సీఎస్ ను, అధికారులను సీఎం ఆదేశించారు.  మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల్లో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీ.ఏ.సీ.ఎస్. కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు.  రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు.


తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని, కనీస మద్దతు ధర పొందేందుకు అనుసరించాల్సిన నిబంధనలను పాటించాలన్నారు.  కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, పత్తి మంచి క్వాలిటీ ఉండటంతోపాటు ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులను కోరారు.  ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
 

పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని తెలిపారు.ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున  కార్పొరేషన్ కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా తెలంగాణా రైతులకి వరం అనే చెప్పాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>