MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shivani-rajashekar5e9d9860-83b6-42d8-aaa8-001af83aac81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shivani-rajashekar5e9d9860-83b6-42d8-aaa8-001af83aac81-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోల, ద‌ర్శ‌కులు ,నిర్మాత‌ల వార‌సులు హీరోలుగా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. ఇస్తున్నారు. కానీ హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చిన న‌టీన‌టుల కూతుల్లు మాత్రం చాలా త‌క్కువే అని చెప్పాలి. అయితే వారిలో రాజ‌శేఖ‌ర్ జీవిత కూతుళ్లు కూడా ఉన్నారు. రాజ‌శేఖ‌ర్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా న‌టించి అల‌రించారు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో అంకుశం సినిమా పేరు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల్లో పోలీస్ పాత్ర అంటే అంకుశంలో రాజ‌శేఖ‌ర్ పాత్ర గుర్తు రావాల్సిందే. దానికి కార‌ణం అంకుశం సినిమాలో రాజ‌శేఖ‌ర్ ఆయ‌shivani rajashekar;anand malayalam actor;jeevitha rajaseskhar;tollywood;cinema;television;heroine;traffic police;father;rajasekhar sivani;rajasekhar sivatmika;anand deverakonda;ankusham;fidaaఆ స‌మ‌యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నా‌నంటున్న శివానీ రాజ‌శేఖ‌ర్..!ఆ స‌మ‌యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నా‌నంటున్న శివానీ రాజ‌శేఖ‌ర్..!shivani rajashekar;anand malayalam actor;jeevitha rajaseskhar;tollywood;cinema;television;heroine;traffic police;father;rajasekhar sivani;rajasekhar sivatmika;anand deverakonda;ankusham;fidaaSun, 11 Apr 2021 15:16:09 GMTటాలీవుడ్ లో హీరోల, ద‌ర్శ‌కులు ,నిర్మాత‌ల వార‌సులు హీరోలుగా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. ఇస్తున్నారు. కానీ హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చిన న‌టీన‌టుల కూతుల్లు మాత్రం చాలా త‌క్కువే అని చెప్పాలి. అయితే వారిలో రాజ‌శేఖ‌ర్ జీవిత కూతుళ్లు కూడా ఉన్నారు. రాజ‌శేఖ‌ర్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా న‌టించి అల‌రించారు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో అంకుశం సినిమా పేరు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల్లో పోలీస్ పాత్ర అంటే అంకుశంలో రాజ‌శేఖ‌ర్ పాత్ర గుర్తు రావాల్సిందే. దానికి కార‌ణం అంకుశం సినిమాలో రాజ‌శేఖ‌ర్ ఆయ‌న పాత్ర‌కు ప్రాణంపోశారు. అంతే కాకుండా రాజ‌శేఖ‌ర్ న‌టించిన సింహ‌రాశి, అల్ల‌రి ప్రియుడు, మా అన్న‌య్య‌, ఎవ‌డైతే నాకేంటి సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. మ‌రో వైపు ఆయ‌న స‌తీమ‌ని జీవిత కూడా అప్ప‌ట్లో హీరోయిన్ గా న‌టించి అల‌రించింది. కాగా రాజ‌శేఖ‌ర్ ను వివాహం చేసుకున్న త‌ర‌వాత ఆమె సినిమాల‌కు గుడ్ బై చెప్పింది. ఇక ఇప్పుడు జీవిత టీవీ షోలతో బిజీగా ఉంది. అంతే కాకుండా రాజ‌శేఖ‌ర్ హీరోగా చేస్తున్న ఒక‌టి రెండు సినిమాల‌ను ఆమె ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది. ఇక వీరిద్ద‌రూ సినిమాల‌కు పెద్ద‌గా ద‌గ్గ‌ర‌గా లేక‌పోయినా వీరి వార‌సులుగా ఎంట్రీ ఇచ్చిన ఇద్ద‌రు కూతుళ్లు పెద్ద కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్, చిన్న కూతురు శివాని రాజ‌శేఖ‌ర్ మాత్రం సినిమాల్లో బిజీగానే ఉన్నారు.

 శివాత్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన దొర‌సాని సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. శివాత్మిక అందానికి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ప్ర‌స్తుతం శివాత్మిక మ‌రో రెండు సినిమాల‌తో రావ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ఇదిలా ఉండగా శివాని రాజ‌శేఖ‌ర్ కూడా ఇప్ప‌టికే త‌న తండ్రి హీరోగా న‌టించిన క‌ల్కి సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం 'WWW అనే టైటిల్ తో వ‌స్తున్న సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే తాజాగా శివాణి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. గ‌తేడాది త‌న జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని తెలిపింది. త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ కు క‌రోనా వ‌చ్చిన సమయంలో తాను ఎంబీబీఎస్ చ‌దువుత‌న్నాని తెలిపింది. అప్పుడు ఓ వైపు స్టడీస్ మ‌రో వైపు తండ్రి అనారోగ్యంతో ఉండ‌టంతో ఒత్తిడికి లోన‌యిన‌ట్టు తెలిపింది. అంతే కాకుండా త‌న‌కు 15 ఏళ్ల నుండి ఓ అనారోగ్య స‌మ‌స్య ఉంద‌ని దాంతో గ‌తేడాది త‌న‌కు కూడా స‌ర్జ‌జీ జ‌రిగింద‌ని తెలిపింది. ఇక తాము సినిమాల్లోకి రావ‌డం కుటుంబ‌మంతా క‌లిసి తీసుకున్న నిర్ణ‌యమ‌ని చెప్పింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై ?

ఆ హీరోయిన్ త్యాగం వల్లనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా..!!

జగన్ ను ఒంటరి చేస్తున్నారా...?

వకీల్ సాబ్ దెబ్బతో డీలా పడ్డ మిల్క్ బ్యూటీ....

సూపర్ స్టార్ ట్వీట్ కి తెగ ఫిదా అయిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్......

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>