Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/richest-cityc64ed842-f929-4045-a337-04896a770fa3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/richest-cityc64ed842-f929-4045-a337-04896a770fa3-415x250-IndiaHerald.jpg సొంతిల్లు కట్టుకోవాలని, సొంత వాహనం కొనుక్కొని దర్జాగా అందులో తిరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. చాలా మందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే చైనాలోని ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లుంటుంది. సొంత కారుంటుంది. అక్కడ నివశించే ప్రజలంతా హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తుంటారు. అందుకే ఈ గ్రామానికి ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామం పేరొచ్చింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో..richest city;jiya;satya;village;lieఅక్కడ నివసించేవారికి కారు, ఇల్లు ఫ్రీ.. కారణమేమిటంటే..?!అక్కడ నివసించేవారికి కారు, ఇల్లు ఫ్రీ.. కారణమేమిటంటే..?!richest city;jiya;satya;village;lieSun, 11 Apr 2021 20:44:00 GMTఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు కట్టుకోవాలని, సొంత వాహనం కొనుక్కొని దర్జాగా అందులో తిరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. చాలా మందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే చైనాలోని ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లుంటుంది. సొంత కారుంటుంది. అక్కడ నివశించే ప్రజలంతా హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తుంటారు. అందుకే ఈ గ్రామానికి ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామం పేరొచ్చింది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు ‘వక్షీ‘. ఈ గ్రామానికి ‘సూపర్ విలేజ్‘ అనే పేరుతో కూడా ఉంది. ఇక్కడ నివసించే వారంతా కోటీశ్వరులే. ఇక్కడ ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఇల్లు, కుటుంబానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్లు ఉంటాయి. అంతేకాదు ఎక్కడికైనా వేరే ప్రదేశాలకు ప్రయాణించాలంటే ఇక్కడివారు ఎక్కువగా హెలికాప్టర్లను ఉపయోగిస్తారట. ఇక అర్థం చేసుకోండి ఈ గ్రామం ఎంత ధనిక ప్రాంతమో.

కాగా.. ఈ గ్రామంలో నిశసించేందుకు ఎవరైనా కొత్తవారు వస్తే.. వారికి అక్కడి ప్రభుత్వం ఓ ఇల్లు, అలాగే కారు కూడా ఉచితంగా ఇస్తుందట. తాజాగా ఈ రూల్స్‌ను తీసుకొచ్చిందట అక్కడి ప్రభుత్వం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ సూపర్ విలేజ్‌లో ప్రస్తుతం 2000 మంది నివాసిస్తున్నారు. ఇక్కడ ఉంటున్న వారి ప్రధాన ఆర్థిక వనరులు వ్యవసాయం కావడం గమనార్హం. ఇక్కడ ఒక రైతు సంవత్సరానికి 80 లక్షలకు పైగా సంపాదిస్తాడంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది అక్షర సత్యం. అయితే ఒకవేళ మీరు ఆ గ్రామాన్ని విడిచి వేరే చోటికి వెళితే మాత్రం వారు అందించిన సౌకర్యాలని మీరు తిరిగి ఇచ్చేయాలి ఉంటుంది.

ఇకపోతే ఈ గ్రామం ఇదివరకు కాలంలో పూర్తిగా కరువు ప్రాంతంగా ఉండేదట. ఈ గ్రామాన్ని 1960లో రెన్ బావో అనే నాయకుడు కనుగొన్నాడు. అయితే అదృష్టవశాత్తు ఈ గ్రామం తలరాత మారి ఇది ప్రపంచంలోనే అత్యధిక ధనిక గ్రామంగా పేరు పొందింది. ఈ గ్రామంలోని ఇల్లు అచ్చం ధనిక దేశాల్లో ఉండే హోటల్స్ లాగే పెద్ద పెద్ద భవంతులు కనపడతాయి. అంతేకాదు ఈ గ్రామంలో చాలా థీమ్ పార్కులు కూడా ఉన్నాయి. చూశారా.. రైతులై ఉండి కూడా ప్రపంచంలోనే ధనికులుగా ఉన్నారు. అందుకే వ్యవసాయాన్ని తక్కువ చేసి చూడొద్దని అంటారు పెద్దలు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్ కోరిక మేరకు నిజంగా వకీల్ సాబ్ లో ఆ ఎపిసోడ్ తీసేస్తారా?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>