Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab857cbf22-bf0a-4bed-a874-9c125f926e43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab857cbf22-bf0a-4bed-a874-9c125f926e43-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 వరకు థియేటర్స్ లో విడుదలై భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో మంచి అంచనాలున్నాయvakeel saab;pawan;chiranjeevi;ananya pandey;ananya;anjali;kalyan;pawan kalyan;sriram;yajamanya;andhra pradesh;telangana;district;cinema;cinema theater;police;hindi;blockbuster hit;nivetha thomas;pink;central government;kamareddy;ananya nagallaథియేటర్ లో భయానక వాతావరణం సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...?థియేటర్ లో భయానక వాతావరణం సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...?vakeel saab;pawan;chiranjeevi;ananya pandey;ananya;anjali;kalyan;pawan kalyan;sriram;yajamanya;andhra pradesh;telangana;district;cinema;cinema theater;police;hindi;blockbuster hit;nivetha thomas;pink;central government;kamareddy;ananya nagallaSun, 11 Apr 2021 03:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 వరకు థియేటర్స్ లో విడుదలై భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో మంచి అంచనాలున్నాయి. దీనికితోడు టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది చిత్రబృందం. ఇక టికెట్ హైక్స్ భారీ గా పెంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా రికార్డ్ లెవల్ బుకింగ్స్ జరిగాయి. అయితే సడెన్ గా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ తగ్గించడంతో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు చాలా ప్రాంతాల్లో పడలేదు. దీంతో కాస్తా కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.


అయితే వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శిస్తున్న సమయంలో ఒక థియేటర్‌లో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. 50 మంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. శాంతి థియేటర్‌లో వకీల్ సాబ్ చిత్ర ప్రదర్శన జరుగుతోంది. శుక్రవారం సెకండ్ షో సమయంలో కొందరు యువకులు మద్యం తాగి థియేటర్‌లోని వచ్చారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సుమారు 50 మంది థియేటర్‌లో భయానక వాతావరణం సృష్టించారు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. సినిమా తెరపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు.


అలాగే థియేటర్‌లోని సీట్లను చింపివేశారు. దీంతో పలువురు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. దాదాపు అరగంట పాటు ఈ గొడవ కొనసాగింది.దీనితో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం.. వకీల్‌సాబ్ సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. యువకులను సముదాయించారు. అయితే ఈ ఘటన ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య గొడవ జరిగినట్టుగా పట్టణంలో ప్రచారం జరుగుతోంది.


ఇక, ఈ ఘటనతో శాంతి థియేటర్ స్క్రీన్‌తోపాటు కొంత భాగం ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.ఇక, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. నిన్న ఉదయం బెనిఫిట్ షో నుంచే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే కొన్ని చోట్ల చిత్ర ప్ర‌ద‌ర్శిన కొంత ఆల‌స్యం కావ‌డంతో.. ప‌వ‌న్ అభిమానులు థియేట‌ర్ల‌లో వీరంగం సృష్టించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ వైసీపీ ఎంపీలు జగన్‌నే నమ్ముకున్నారా?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>