Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab9cdf5a09-67f3-444d-8219-6430154a6a9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab9cdf5a09-67f3-444d-8219-6430154a6a9b-415x250-IndiaHerald.jpgచాలా కాలం తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మూడేళ్ల తరువాత తెరపై కనిపించినా.. అదే జోరు, అదే స్టామినాతో అదరగొట్టాడు. దీంతో అభిమానులంతా తెగ ఖుషీ అవుతున్నారు. థియేటర్ల వద్ద కూడా అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఇక కలెక్షన్ల విషయంలో..VakeelSaab;pawan;ganga;geetha;jeevitha rajaseskhar;johnny;kushi;pawan kalyan;raghava lawrence;sampath;sampath nandi;surya sivakumar;tarun;trivikram srinivas;ganges;tollywood;cinema;telugu;rayalaseema;blockbuster hit;remake;director;tsunami;hero;gabbar singh;nuvve kavali;johnny1;aravinda sametha veera raghava;tarun kumarపవన్‌ కల్యాణ్ చేయాలనుకుని ఆగిపోయిన 12 సినిమాలు.. అవేంటో తెలుసా..?పవన్‌ కల్యాణ్ చేయాలనుకుని ఆగిపోయిన 12 సినిమాలు.. అవేంటో తెలుసా..?VakeelSaab;pawan;ganga;geetha;jeevitha rajaseskhar;johnny;kushi;pawan kalyan;raghava lawrence;sampath;sampath nandi;surya sivakumar;tarun;trivikram srinivas;ganges;tollywood;cinema;telugu;rayalaseema;blockbuster hit;remake;director;tsunami;hero;gabbar singh;nuvve kavali;johnny1;aravinda sametha veera raghava;tarun kumarSun, 11 Apr 2021 16:52:42 GMTఇంటర్నెట్ డెస్క్: చాలా కాలం తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మూడేళ్ల తరువాత తెరపై కనిపించినా.. అదే జోరు, అదే స్టామినాతో అదరగొట్టాడు. దీంతో అభిమానులంతా తెగ ఖుషీ అవుతున్నారు. థియేటర్ల వద్ద కూడా అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఇక కలెక్షన్ల విషయంలో వకీల్ సాబ్ సునామీ సృష్టిస్తోందనే చెప్పాలి. తొలి రోజే ఏకంగా రూ.35 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో అంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులుండవు. అలాగే ఆ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ఇమేజ్‌ వల్లనే అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాలను ఎంపిక చేసుకుంటుంటాడు పవన్ కల్యాణ్. అందుకే ఇప్పటివరకు పవన్ కేవలం 26 సినిమాలే చేశాడు. అయితే ఈ 26 సినిమాలు కాకుండా మరో 12 సినిమాలు కూడా పవన్ సైన్ చేశాడని మీకు తెలుసా..? కానీ ఆ సినిమాలన్నీ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ములనపడ్డాయి. వాటిని పవన్ పక్కన పెట్టేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్‌ కల్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన తొలి చిత్రం చెప్పాలని ఉంది. తొలుత ఈ సినిమాను ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా, అమిషా ప‌టేల్ హీరోయిన్‌గా తెరకెక్కించాలనుకున్నారు. సూర్య మూవీస్ బ్యానర్లో ఈ చిత్రం మొదలైంది. అయితే ఎవో కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా నుంచి ప‌వ‌న్ త‌ప్పుకున్నాడు. దీంతో ఈ సినిమాను నువ్వే కావాలి పేరుతో తరుణ్ హీరోగా తెర‌కెక్కించారు.

పవన్ కెరీర్‌ను భారీ బూస్ట్ ఇచ్చిన సినిమా ఏదంటే ఎస్ జే సూర్య డైరెక్షన్‌లో భూమికతో కలిసి చేసిన ఖుషీ సినిమా అనే చెప్పాలి. అయితే ఆ సినిమాకు సీక్వెల్ కూడా తీయాలని అప్పట్లో అనుకున్నారట. దానికి ఖుషీ 2 అని కూడా పేరు పెట్టుకున్నాడట పవన్. దీనిపై ఓ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. కానీ ఆ తర్వాత ఎందుకో దానిని పవన్ పట్టించుకోలేదు.

సొంత కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్లో తెరకెక్కించిన జానీ ప్లాప్ తరువాత పవన్ సత్యాగ్రహి అనే సినిమా చేయాలనుకున్నాడట. అది కూడా తానే డైరెక్ట్ చేయాలని అనుకున్నాడట. దానికోసం రాసుకున్న కథకు స‌త్యాగ్ర‌హి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట. ఎంఏ ర‌త్నం నిర్మాత‌గా ఈ సినిమా ప్రారంభం అయినా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే నిలిచిపోయింది.
ఆ తర్వాత ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఓ మూవీ తీయాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్ర‌క‌ట‌ించారు కూడా. కానీ ఆ తర్వాత ఈ సినిమా ముందుకు సాగ‌లేదు.

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ప్రయత్నాలు చేశాడట. చివ‌ర‌కు ఓ సినిమా చేస్తున్న‌ట్లు అప్పట్లో ప్ర‌క‌టన కూడా చేశాడు. కానీ అనివార్య కార‌ణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక పవన్ స్నేహితుడు, టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్సినిమా తీయాలని అనుకున్నాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ప‌వ‌న్‌తో ఆ సినిమా చేయాలనుకున్నాడట. దానికి కోబలి అనే అదిరిపోయే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. కానీ ఆ తర్వాత అది క్యాన్సిల్ అయ్యింది. అదే క‌థ‌ను కాస్త అప్డేట్ చేసిన ఎన్టీఆర్‌తో అరవింద సమేత మూవీ చేసిన‌ట్లు కూడా రూమర్లున్నాయి.

టాలీవుడ్ స్క్రీన్‌పై ప్రస్తుతతరంలో మల్టీ స్టారర్ సినిమాకు నిలువెత్తు నిదర్శనం సితమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ముందు పవన్, వెంకటేష్‌లతో చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ రాజ‌కీయాల మూలంగా ప‌వ‌న్ త‌ప్పుకున్నాడు. ఆయ‌న ప్లేస్‌లో మ‌హేష్ బాబు వ‌చ్చాడు. వీవీ వినాయ‌క్ కూడా వ‌ప‌న్‌తో సినిమా చేయాల‌ని చాలా కాలం ఎదురు చూశాడట. ఆ మ‌ధ్య ఓ సినిమా కూడా చేస్తున్న‌ట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు.

‌గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్‌తో గబ్బర్ సింగ్ 2 సినిమా చేయాలని డైరెక్టర్ సంపత్ నంది భావించాడట. కానీ ఆ సినిమా మొదలు కాలేదు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ ఓ ప్లాప్‌ను మూటగట్టుకున్నాడు. కాటమరాయుడు కంటే ముందే ఎస్‌జే సూర్యతో ఓ సినిమా మొద‌లు పెట్టాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. కానీ ఆ సినిమా సెట్స్‌ పైకి మాత్రం వెళ్ల లేదు. దాని వెనకున్న కారణాలు కూడా ఇప్పటికీ బయటకు రాలేదు.

ఇక త‌మిళంలో వేదాళం సినిమాతో మంచి విజ‌యం సాధించిన డైరెక్షన్‌ నీసన్.. అదే సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాల‌నుకున్నాడు. దాని కోసం పవన్‌ను సంప్రదించాడు. సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ త‌ర్వాత ఆ సినిమా ఆగిపోయింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కొవిడ్ ఉధృత రూపం

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

పవన్ 'వకీల్ సాబ్'.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్.. మీకు ఈ మాట చెప్పామన్నారు : దిల్ రాజు

జాతి ర‌త్మాలు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్..లాభం ఎంత వ‌చ్చిందంటే.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>