Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaa0bec475-302a-4609-bd3f-1f688d88ddc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaa0bec475-302a-4609-bd3f-1f688d88ddc4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం నాగార్జునసాగర్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతుంది. ఇప్పటికే గతంలో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగగా ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేక పోయింది. ఊహించని విధంగా బిజెపి దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు విజయం సాధించ బోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంTelangana;view;kcr;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;mp;chief minister;reddy;party;malkajgiriసాగర్ లో ఓటమి భయం.. అందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారు..?సాగర్ లో ఓటమి భయం.. అందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారు..?Telangana;view;kcr;revanth;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;mp;chief minister;reddy;party;malkajgiriSun, 11 Apr 2021 10:00:00 GMTతెలంగాణ రాజకీయం మొత్తం నాగార్జునసాగర్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతుంది. ఇప్పటికే గతంలో దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగగా ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేక పోయింది.  ఊహించని విధంగా బిజెపి దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు విజయం సాధించ బోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.


 ముఖ్యంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు అందరూ రంగంలోకి దిగి తమ ప్రసంగాలతో ఓటర్ మహాశయులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమదే విజయమని అంటూ ప్రస్తుతం అన్ని పార్టీలు ఎంతో ధీమాతో ఉన్నాయి.  అదే సమయంలో అటు సెట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు కదులుతోంది. అయితే ఇటీవలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ ప్రచారంలో భారీగా అభిమానులు తరలి వచ్చారు.



 ఈ సందర్భంగా తన ప్రసంగంతో ఓటర్ మహాశయులకు ఆకట్టుకున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సానుభూతి పనికొస్తుంది అనే ఉద్దేశంతోనే  నోముల భగత్ కు సీటు ఇచ్చారు అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ఒక్కసారి కూడా పర్యటించని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం రెండుసార్లు ఎందుకు రావడానికి సిద్ధమయ్యారు అంటూ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కె.సి.ఆర్ ఇలా చేస్తున్నారు అంటూ ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>