MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/posteal-insurance-saving-money7b5ea16f-4767-4806-b000-7e1fa4543355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/posteal-insurance-saving-money7b5ea16f-4767-4806-b000-7e1fa4543355-415x250-IndiaHerald.jpgపోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు ప్రజల కోసం సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ లను తీసుకొస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అయితే పోస్ట్ ఆఫీస్ ప్రజల జీవితంలో ఒక భాగం. కానీ ఇప్పుడది ఇదివరకటిలా కాదు. ఎన్నో మార్పులను చోటు చేసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఇందులో ముఖ్యంగా పాస్ పోర్ట్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని, ఆధార్ కార్డు కరెక్షన్ సహా, కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కార్యక్రమాలకు కూడా కేంద్రంగా నిలిచింది. ఇక మధ్య తరగతి ప్రజల ఆర్థిక వనరులను మరింత బలోపేతం చేయడం కోసం ప్రధాన వనరPOSTEAL INSURANCE SAVING MONEY;amala akkineni;jeevitha rajaseskhar;suma;suma kanakala;indian postal service;application;central governmentమనీ : పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!మనీ : పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!POSTEAL INSURANCE SAVING MONEY;amala akkineni;jeevitha rajaseskhar;suma;suma kanakala;indian postal service;application;central governmentSun, 11 Apr 2021 11:00:00 GMT
పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు ప్రజల కోసం సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ లను తీసుకొస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అయితే పోస్ట్ ఆఫీస్ ప్రజల జీవితంలో ఒక భాగం. కానీ ఇప్పుడది ఇదివరకటిలా కాదు. ఎన్నో మార్పులను చోటు చేసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఇందులో ముఖ్యంగా పాస్ పోర్ట్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని, ఆధార్ కార్డు కరెక్షన్ సహా, కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కార్యక్రమాలకు కూడా కేంద్రంగా నిలిచింది. ఇక మధ్య తరగతి ప్రజల ఆర్థిక వనరులను మరింత బలోపేతం చేయడం కోసం ప్రధాన వనరుగా మారింది పోస్ట్ ఆఫీస్. లక్షలాది మంది ప్రజలకు  జీవితంలో  భరోసా గా నిలిచింది. ఒక మధ్యతరగతి ప్రజల జీవన విధాన  ప్రమాణాలను మెరుగు పరచడంలో కీలకపాత్ర వహిస్తూ, ప్రజలకు అండగా నిలిచింది .

ఇందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్ పలురకాల లైఫ్ ఇన్సూరెన్స్ లను తీసుకొచ్చింది. 1995లో పోస్టాఫీసు శాఖ గ్రామీణ ప్రజలకు బీమా అందించడానికి గ్రామీన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించింది. ఇక ఇందులో మరీ ముఖ్యంగా సుమంగళ్ పథకం మరింత ప్రయోజనకారిగా ఉంటుంది. గ్రామీన సుమంగళ్ పాలసీ కాలపరిమితి కనిష్టంగా 15 సంవత్సరాలు,  గరిష్టంగా 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే నలభై సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు ఈ గ్రామీన సుమంగళ్ పాలసీలో డబ్బులు జమ చేయవచ్చు. 40 సంవత్సరాల వయసులో ఈ పాలసీ లో చేరితే గరిష్ట పరిమితి 20 ఏళ్లు. 45 సంవత్సరాల వయసులో తీసుకుంటే గరిష్ట పరిమితి 15 సంవత్సరాలుగా నిర్ధారించారు..


15 సంవత్సరాల కాలపరిమితి ఉండే పాలసీని తీసుకుంటే 6,9,12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 - 20 శాతం తో ఆర్థిక భరోసా లభిస్తుంది. మెచ్యూరిటీ పై 40 శాతం మేర డబ్బులు బోనస్ గా పొందవచ్చు. ఇక అదే 20 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పాలసీ తీసుకుంటే 8,12,16 సంవత్సరాలలో 20 -20 శాతం డబ్బు తిరిగి పొందవచ్చు. మెచ్యూరిటీ పై 40 శాతం వరకూ బోనస్ కూడా ఉంటుంది.. ఇక ఈ పథకం లో డిపాజిట్ చేసిన ప్రతి వెయ్యి రూపాయలకు 48 రూపాయలు బోనస్ గా అందుతుంది. పాలసీదారుడి వయసు 25 సంవత్సరాలు ఉంటే నెలవారీ ప్రీమియం 2,853 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.


మొత్తం వార్షిక ప్రీమియం 32, 735 రూపాయలుగా నిర్ధారించారు. ఇక పాలసీ తీసుకున్న 8, 12,16 సంవత్సరాలలో మీకు 1.4  - 1.4 లక్షల రూపాయల చొప్పున లభిస్తుంది. ఇక 20 వ సంవత్సరంలో 2,08,000 రూపాయలు లభిస్తాయి. ప్రతి వెయ్యి రూపాయలకు నలభై ఎనిమిది రూపాయల బోనస్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఏడు లక్షల మొత్తానికి గాను వార్షిక బోనస్ 33,600 రూపాయలు లభిస్తుంది. ఇక ఇరవై వ సంవత్సరంలో తీసుకుంటే ఈ మొత్తం 13.72  లక్షల రూపాయలు లభిస్తాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ మంత్రి... జ‌గ‌న్ చేసిన పంచాయితీ ?

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్..!

టాలీవుడ్ కి అంధ్రా నుంచి రాయితీలు ఇవ్వాలా..?

జగన్ లేఖను కేంద్రం లైట్ తీసుకుందా...?

చంద్రబాబు, లోకేష్ పై కేసు

పవన్ కు దూరమవుతున్న ఫాన్స్...?

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>