PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-bye-poll1823835b-6027-42de-9e20-c8487991466a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-bye-poll1823835b-6027-42de-9e20-c8487991466a-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చప్పగానే సాగుతోంది అనిపిస్తోంది. ఒక వైపు కరోనా మరో వైపు మండిస్తున్న ఎండలతో పాటు, ఇప్పటికే వరసగా వచ్చిన స్థానిక ఎన్నికలతో జనాలు చాలా విసిగిపోయి ఉన్నారని అంటున్నారు. tpt bye poll;tiru;jagan;2019;రాజీనామా;tirupati;murder;husband;murder.;local language;central government;research and analysis wingతిరుపతి జనాలు కనెక్ట్ అవుతారా...?తిరుపతి జనాలు కనెక్ట్ అవుతారా...?tpt bye poll;tiru;jagan;2019;రాజీనామా;tirupati;murder;husband;murder.;local language;central government;research and analysis wingSun, 11 Apr 2021 22:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చప్పగానే సాగుతోంది అనిపిస్తోంది. ఒక వైపు కరోనా మరో వైపు మండిస్తున్న ఎండలతో పాటు, ఇప్పటికే వరసగా వచ్చిన స్థానిక ఎన్నికలతో జనాలు చాలా విసిగిపోయి ఉన్నారని అంటున్నారు.

దాంతో పాటు నేతల ప్రసంగాలు కూడా ఏమీ కొత్తగా ఉండడంలేదు. రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకమైన ప్రచారం చేశారో ఇపుడు అవే చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక హోదా,  విభజన హమీలు, రాజీనామా సవాళ్ళు,  జగన్  అవినీతి,  వైఎస్ వివేకా దారుణ హత్య ఇవన్నీ కూడా 2019 ఎన్నికల వేళ చంద్రబాబు ఊరూరా తిరుగుతూ చెప్పిన మాటలే. జగన్ మీద డైరెక్ట్ గా చేసిన విమర్శలే.

ఇపుడు కూడా అయన వాటినే పదే పదే మాట్లాడుతున్నారు. ఇక వ్యక్తిగతంగా కూడా తిట్ల పురాణాలు అందుకుంటున్నారు. అదే సమయంలో తిరుపతి లోక్ సభ పరిధిలోని అంశాలను ఎవరూ ప్రస్తావించడంలేదు. అదే విధంగా జగన్ రెండేళ్ళ పాలన మీద కూడా పెద్దగా మాట్లాడడంలేదు. ఇక ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదు అన్నది అందరికీ తెలిసిందే. దాంతో కేంద్రం మీద గట్టిగా విమర్శలు చేస్తే ఏమైనా జనాలు కనెక్ట్ అయ్యేవారేమో అన్న మాట కూడా ఉంది.

కానీ చిల్లర రాజకీయాలతో గల్లీలోనే సవాళ్ళు చేసుకుంటూ ఒకరిని ఒకరు నిందించుకుంటే ప్రయోజనం ఏంటి అన్నది కూడా తిరుపతి జనాలకు అర్ధం కావడంలేదు అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఒక్కటే అన్న మాట జనాల నుంచి వినిపిస్తోంది. ఎవరు గెలిచినా కూడా అద్భుతాలు జరిగిపోవు అని కూడా అంటున్నారు. మొత్తానికి జనాలకు పెద్దగా ఆసక్తి లేని వేళ, పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయనుకోవాలి. మరి ఓటింగ్ ఎలా జరుగుతుందో కూడా చూస్తేనే తప్ప జనాభిప్రాయం పూర్తిగా బయటపడదు అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రయివేట్ స్కూళ్లకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్...

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>