PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpe874b9dd-1a85-49dc-8a8f-f0a6f08b8b7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpe874b9dd-1a85-49dc-8a8f-f0a6f08b8b7a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ వేవ్ ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇంత భారీ ఆధిక్యంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టడం చాలా కష్టమైపోతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌ హవా తగ్గించడం, చంద్రబాబు వల్ల కావడం లేదు. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు గట్టిగానే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అలాగే రాజకీయంగా ప్రతి అంశంలోనూ పోరాడుతున్నారు.tdp;view;hari;hari music;srinivas;tiru;korcha;jagan;andhra pradesh;2019;avanthi srinivas;vishakapatnam;television;minister;fort;tdp;local language;ycp;bheemili;sabbam hari;partyఅక్కడ టీడీపీకి మంచి ఛాన్స్...సెట్ చేసేది ఎవరో?అక్కడ టీడీపీకి మంచి ఛాన్స్...సెట్ చేసేది ఎవరో?tdp;view;hari;hari music;srinivas;tiru;korcha;jagan;andhra pradesh;2019;avanthi srinivas;vishakapatnam;television;minister;fort;tdp;local language;ycp;bheemili;sabbam hari;partySun, 11 Apr 2021 01:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ వేవ్ ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇంత భారీ ఆధిక్యంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టడం చాలా కష్టమైపోతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌ హవా తగ్గించడం, చంద్రబాబు వల్ల కావడం లేదు. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు గట్టిగానే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అలాగే రాజకీయంగా ప్రతి అంశంలోనూ పోరాడుతున్నారు.


అయితే ఎంత పోరాడినా ప్రజలు మాత్రం జగన్ వైపే నిలుస్తున్నారు. ప్రజలు వైసీపీకి అనుకూలంగానే తీర్పు ఇస్తున్నారు. అయినా సరే బాబు వదలకుండా టీడీపీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. కానీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళితే లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. బాబు మొదట టీడీపీ త్వరగా బలం పుంజుకునే నియోజకవర్గాల మీద దృష్టి పెడితే బాగుంటుందని సొంత పార్టీలోనే చర్చలు నడుస్తున్నాయి.


పలు నియోజకవర్గాల్లో నాయకులని యాక్టివ్ చేస్తే మరింత మేలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో  పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. మామూలుగానే భీమిలి టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ గెలిచారు. చివరి నిమిషంలో టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న సబ్బం హరి ఓటమి పాలయ్యారు. అయితే అంత జగన్ వేవ్‌లో ఇక్కడ అవంతికి 9 వేల మెజారిటీనే వచ్చింది.


ఇక అవంతి గెలిచి మంత్రి అయ్యి, నియోజకవర్గంపై మరింత పట్టు సాధించుకునే దిశగా పనిచేస్తున్నారు. కానీ ఓడిపోయిన సబ్బం హరి నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఆయన విశాఖలో ఉంటూ, టీవీ డిబేట్లలో మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో భీమిలిలో మంచి నాయకుడుని పెట్టాలని తమ్ముళ్ళు కోరుతున్నారు. పైగా ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో భీమిలి పరిధిలో ఉన్న డివిజన్లలో టీడీపీ సత్తా చాటింది. ఇక్కడున్న 9 డివిజన్లలో టీడీపీ 5 గెలిస్తే, వైసీపీ 4 గెలుచుకుంది. దీని బట్టి చూసుకుంటే భవిష్యత్‌లో భీమిలిలో టీడీపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సరైన నాయకుడుని సెట్ చేస్తే తిరుగుండదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>