SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/loird-lakshmi-importanced65d514b-61d2-4a41-bc1f-71a29c44a80f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/loird-lakshmi-importanced65d514b-61d2-4a41-bc1f-71a29c44a80f-415x250-IndiaHerald.jpgఏ ఇల్లు అయినా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. లక్ష్మి దేవి అడుగు పెట్టినప్పుడే ఇంట్లో ధన ధాన్యాలకు. ఐశ్వర్యాలకు కొదువ ఉండదు. అయితే కొన్ని పద్ధతులు పాటించని వారి ఇంటికి ఆ శ్రీ మహా లక్ష్మి రాదట. ఇంతకీ అవేంటో తెలుసుకొని పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మి దేవి అడుగు పెట్టి సిరులు పండిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. LOIRD LAKSHMI IMPORTANCE;lakshmi;sampada;vishnu;janmashtmi;lakshmi devi;aqua;letter;mahaపూజలు వ్రతాలు చేసినా...మీ ఇంట్లోకి లక్ష్మి దేవి రావడం లేదా...?పూజలు వ్రతాలు చేసినా...మీ ఇంట్లోకి లక్ష్మి దేవి రావడం లేదా...?LOIRD LAKSHMI IMPORTANCE;lakshmi;sampada;vishnu;janmashtmi;lakshmi devi;aqua;letter;mahaSun, 11 Apr 2021 07:34:02 GMTఏ ఇల్లు అయినా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. లక్ష్మి దేవి అడుగు పెట్టినప్పుడే ఇంట్లో ధన ధాన్యాలకు. ఐశ్వర్యాలకు కొదువ ఉండదు. అయితే కొన్ని పద్ధతులు పాటించని వారి ఇంటికి ఆ శ్రీ మహా లక్ష్మి రాదట. ఇంతకీ అవేంటో తెలుసుకొని పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మి దేవి అడుగు పెట్టి సిరులు పండిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎల్లపుడూ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంట్లోని చెత్తను బయట పడేయాలి. ఇంట్లో చెత్తను నిల్వ ఉంచరాదు. ఎంగిలి ప్లేట్లను కడగకుండా ఇంటి బయట వదిలేయ రాదు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఇంట్లో ఇల్లాలు ఎల్ల వేళలా కంటతడి పెట్ట కూడదు...ఒక వేళ ఇలా జరిగితే వారింట లక్ష్మి కొలువై ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ మహా విష్ణువును ఆరాధించకుండా..ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసే వారి ఇంట లక్ష్మి ఉండదు. హృదయములో పవిత్రత లోపించినా..ఇతరులను హింసిస్తున్న..నిందిస్తున్న..ఇతరులకు నిరంతరం భాద కలిగించే పనులు చేసినా  లక్ష్మి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అనవసరంగా గడ్డి పరకలను తెంచినా,  మొక్కలను నరికినా ..వారి ఇంట్లో లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.

పశు పక్షాదులను హింసించే చోట లక్ష్మి ఎన్నటికీ నివసించలేదు. సంపద మీద దురాశ ఎక్కువగా ఉన్న వారి ఇంట కూడా లక్ష్మి ఉండనే ఉండదు. ఎంత సంపద ఉన్నా సంతృప్తి లేని వారి ఇంట్లో లక్ష్మి నిలువలేదు. ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు నవ్వుతూ ఇల్లు  కళ కళ లాడుతుందో ఆ ఇల్లు సుఖ ఎప్పుడూ సుఖ సంపదలతో విరాజిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గృహిణి ఈ విషయాలను ఖచ్చితంగా పాటించినట్లయితే వారి ఇల్లు ఆనంద హరివిల్లు అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌న‌కు అంద‌కుండానే విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తా...? ‌మోదీపై సోనియా సెటైర్‌..!

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>