CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-newscdf328b0-3e8e-40fd-be52-8325707b8f59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-newscdf328b0-3e8e-40fd-be52-8325707b8f59-415x250-IndiaHerald.jpg57 ఏళ్ల మ‌హిళ క‌ట్టుకున్న భ‌ర్త‌నే 62 బీమా డ‌బ్బుల‌కోసం క‌డ‌తేర్చింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. హ‌త్య కోసం త‌న బందువు స‌హాయం తీసుకుంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా హ‌త్య చేసి ప్ర‌మాదంగా చిత్రించే ప్ర‌య‌త్నం చేసింది. పోలీసుల విచారణ‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం....ఈరోడ్ జిల్లాలోని తుడుప‌తి నివాసి రంగ‌రాజ‌న్ కు ప‌వ‌ర్ లూమ్ బిజినెస్ ఉంది. కాగా మ‌ర్చి 15న రంగ‌రాజ‌న్ ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. చికిత్స అనంత‌రం రంగ‌రాజ‌న్ ఆస్ప‌త్రి నుండి డిశ్చార్tamil nadu;business;raja;police;television;petrol;wifeబీమా డబ్బులకోసం భార్య దారుణం.!బీమా డబ్బులకోసం భార్య దారుణం.!tamil nadu;business;raja;police;television;petrol;wifeSun, 11 Apr 2021 10:03:06 GMT57 ఏళ్ల మ‌హిళ క‌ట్టుకున్న భ‌ర్త‌నే 62 బీమా డ‌బ్బుల‌కోసం క‌డ‌తేర్చింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. హ‌త్య కోసం త‌న బందువు స‌హాయం తీసుకుంది. గుట్టు చ‌ప్పుడు కాకుండా హ‌త్య చేసి ప్ర‌మాదంగా చిత్రించే ప్ర‌య‌త్నం చేసింది. పోలీసుల విచారణ‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం....ఈరోడ్ జిల్లాలోని తుడుప‌తి నివాసి రంగ‌రాజ‌న్ కు ప‌వ‌ర్ లూమ్ బిజినెస్ ఉంది.  కాగా మ‌ర్చి 15న రంగ‌రాజ‌న్ ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. చికిత్స అనంత‌రం రంగ‌రాజ‌న్ ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ త‌ర‌వాత రంగ‌రాజ‌న్ ను తీసుకుని ఆయ‌న భార్య జోతిమ‌ణి..సమీప బంధువు రాజా క‌లిసి ఆస‌త్రి నుండి త‌మ ఇంటికి ప్ర‌యాణం ప్రారంభించారు. రాత్రి 11 గంట‌ల సమ‌యంలో రాజా వాహ‌నాన్ని పెరుమ‌నుల్లూరు స‌మీపంలో ఆపారు. రాజా జోతిమ‌ణి వాహనం  నుండి దిగి ఆ వాహ‌నం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాన్ని ప్ర‌మాదం గా చిత్రించే ప్ర‌య‌త్నం చేసారు. ఈ ఘ‌ట‌న పై కేసున‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ మొద‌లు పెట్టారు. జోతిమ‌ణి బంధువు రాజా మార్గ‌మ‌ధ్యలో ఓ పెట్రోల్ బంక్ వ‌ద్ద డ‌బ్బాలో పెట్రోల్ తీసుకున్న‌ట్టు సీసీ టీవీ పుటేజ్ ఆదారంగా గుర్తించారు.  

అనంత‌రం రాజాను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు త‌మ స్లైల్ లో విచార‌ణ మొద‌లు పెట్టారు. దాంతో రాజా నిజం ఒప్పుకున్నారు. అంతే కాకుండా ఈ కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జోతి మ‌ణి భ‌ర్త రంగ‌రాజ‌న్ వ్యాపారం లో న‌ష్టాల కారణం గా ప‌లువురి నుండి రూ.1.5 కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకున్నారు. దాంతో డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అప్పు ఇచ్చిన వారు ఇంటికి వ‌చ్చి అడ‌గ‌టం మొద‌లు పెట్టారు.అయితే ఆ డ‌బ్బును క‌ట్టేందుకు జోతిమ‌ణి ప‌థ‌కం రచించింది. త‌న భ‌ర్త రంగ‌రాజ‌న్ పేరుపై ఉన్న రూ.3 కోట్ల విలువైన బీమా డ‌బ్బుల కోసం భ‌ర్త‌ను హ‌త‌మార్చింది. అప్పు ఇచ్చిన వారి వేధింపుల వ‌ల్లే ఇలా చేశాన‌ని వెల్ల‌డించింది. హ‌త్య కోసం త‌మ బందువు రాజాకు 50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్టు పేర్కొంది. అంతే కాకుండా ప‌ని పూర్త‌యిన తర్వాత మ‌రో ల‌క్ష ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాన‌ని చెప్పింది. ‌



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ మీద మోజు ఎంతో తేల్చేస్తారా...?

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>