CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-hacking-minor-e-mail-ciber-crime33a28637-bbc8-4027-b350-4caa16145aaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-hacking-minor-e-mail-ciber-crime33a28637-bbc8-4027-b350-4caa16145aaa-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా ఇటీవ‌లి కాలంలో పోలీసుల‌పై దాడులు పెరిగిపోయాయి. అయితే ఇందులో కొన్ని ఉన్మాద చ‌ర్య‌లు కాగా.. మ‌రికొన్ని ఉద్రేక చ‌ర్య‌లు.. ఇంకొన్ని తిరుగుబాట్లుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ప‌శ్చిమబెంగాల్‌లో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. పోలీసుల‌కున్న ర‌క్ష‌ణ‌ను ప్ర‌శ్నించేలా ఉంది. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే..బీహార్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి బైక్‌ చోరీ కేసు విష‌యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడి స్థానికులు ఆయన్ని కొట్టి చంపడం సంచ‌ల‌నం రేపింది. బిహాBihar-Cop;aswini;tiru;islam;telangana;district;police;bihar;air;police station;traffic police;local language;siddipet;gharshanaబెంగాల్‌లో దారుణం.. విచార‌ణ‌కు వెళ్లిన పోలీస్‌ను కొట్టి చంపారు...బెంగాల్‌లో దారుణం.. విచార‌ణ‌కు వెళ్లిన పోలీస్‌ను కొట్టి చంపారు...Bihar-Cop;aswini;tiru;islam;telangana;district;police;bihar;air;police station;traffic police;local language;siddipet;gharshanaSun, 11 Apr 2021 09:34:14 GMTదేశ వ్యాప్తంగా ఇటీవ‌లి కాలంలో పోలీసుల‌పై దాడులు పెరిగిపోయాయి. అయితే ఇందులో కొన్ని ఉన్మాద చ‌ర్య‌లు కాగా.. మ‌రికొన్ని ఉద్రేక చ‌ర్య‌లు.. ఇంకొన్ని తిరుగుబాట్లుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ప‌శ్చిమబెంగాల్‌లో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. పోలీసుల‌కున్న ర‌క్ష‌ణ‌ను ప్ర‌శ్నించేలా ఉంది. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే..బీహార్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి బైక్‌ చోరీ కేసు విష‌యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడి స్థానికులు ఆయన్ని కొట్టి చంపడం సంచ‌ల‌నం రేపింది. బిహార్‌కు చెందిన అశ్వనీ కుమార్‌ కిషన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


ఇటీవల ఓ బైక్‌ చోరీ కేసు గురించి ఆరా తీయడం కోసం ఆయన బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లాకు వెళ్లారు. పంజిపరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆయన గోల్‌ పొఖారా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లగా.. సదరు గ్రామస్థులు అశ్వనీకుమార్‌పై రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.  తీవ్ర గాయాలతో పడి ఉన్నపోలీస్‌ అధికారి అశ్విని కుమార్‌ను ఇస్లాంపూర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి కారణమైన ఒకరిని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనిఖీలు చేసి మరికొందరిని అరెస్ట్‌ చేస్తామని పూర్ణియ రేంజ్‌ ఐజీ తెలిపారు.


ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్‌, బీహార్ పోలీస్‌శాఖ‌ల మ‌ధ్య వాగ్వాదం న‌డుస్తోంది.  కేసు విచారణ నిమిత్తం బెంగాల్‌ వెళ్లిన అశ్వనీ కుమార్‌ స్థానిక పోలీసుల సహకారం కోరారు. కానీ బెంగాల్‌ పోలీసులు అతడి వెంట బృందాన్ని పంపడంలో విఫలమయ్యారని బిహార్‌ పోలీస్ ఉన్న‌తాధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ను ఆపడానికి ప్రయత్నించిన కోహెడ పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ పోలీసులపై దాడి చేసిన విష‌యం తెలిసిందే.  ఇలా పోలీసుల‌పై ఉన్మాదులు, నేర‌గాళ్లు దాడుల‌కు తెగ‌బ‌డుతుండ‌టంపై పోలీస్ సిబ్బందిలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>