Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/thamalapaku-juice331a90d6-7755-4192-ae06-8e29f9bd0dad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/thamalapaku-juice331a90d6-7755-4192-ae06-8e29f9bd0dad-415x250-IndiaHerald.jpg తమలపాకును పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా వాడుతారు. ఏదైనా శుభకార్యం లోనూ తమలపాకులు లేకుండా శుభకార్యాలు చేయరు. తమలపాకును చాలామందికి వేసుకొని అలవాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా వేసవికాలంలో తమలపాకు జ్యూస్ తాగడం చాలా మంచిది. ఇందులో చావికోల్, బెట్టల్ ఫినాల్, యూజినాల్,టర్పేన్,కాంపిన్ వంటివి ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. తమలపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం... thamalapaku juice;pooja hegde;tara;mandula;cancer;sugar;oil;betel;cholesterol;protein;shaktiతమలపాకు జ్యూస్ తాగితే..?అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి...!తమలపాకు జ్యూస్ తాగితే..?అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి...!thamalapaku juice;pooja hegde;tara;mandula;cancer;sugar;oil;betel;cholesterol;protein;shaktiSun, 11 Apr 2021 07:00:00 GMT
 తమలపాకును పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా వాడుతారు. ఏదైనా శుభకార్యం లోనూ తమలపాకులు  లేకుండా శుభకార్యాలు చేయరు. తమలపాకును చాలామందికి వేసుకొని అలవాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా వేసవికాలంలో తమలపాకు జ్యూస్ తాగడం చాలా మంచిది. ఇందులో చావికోల్, బెట్టల్ ఫినాల్, యూజినాల్,టర్పేన్,కాంపిన్ వంటివి ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి  ఉపయోగపడతాయి. తమలపాకు  జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం...

 యాంటీ బయాటిక్ మందులు వాడేవారిలో కాలేయంలో, మూత్రపిండాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ తమలపాకు జ్యూస్ లో యాంటీబయటిక్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎండిన  తమలపాకుల పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించదు.

 అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లు తమలపాకు జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడానికి తమలపాకు జ్యూస్ లో ఉండే యుజినాల్ నాల్  బాగా సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

 తమలపాకు జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. తమలపాకు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్,యాంటీ మ్యూటజేనిక్, యాంటీబ్యాక్టీరియల్, కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.

 తమలపాకు లో ఉండే ముఖ్యమైన నూనె వ్యాధికారక బ్యాక్టీరియా కు వ్యతిరేకంగా యాంటీబ్యాక్టీరియల్ చర్యను  కలిగి ఉంటుంది. తమలపాకు జ్యూస్ లో ఫినోలెక్స్, ఫైటోకెమికల్స్ ఉండడంవల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

 గాయాలను నయం చేయడానికి తమలపాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాలిన గాయాలపై తమలపాకును పెట్టడం వల్ల గాయం తొందరగా మానుతుంది. అంతేకాకుండా తమలపాకు జ్యూస్ కూడా తీసుకోవడం వల్ల  గాయాలు మానుతాయి. తమలపాకులో గాయాలు మానడానికి అవసరమైనా ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అందుకే తమలపాకు జ్యూస్ తాగడం మంచిది.

 ఆస్తమాతో బాధపడే వాళ్ళు తమలపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల ఉపశమనం  కలుగుతుంది. తమలపాకు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉబ్బసాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. తమలపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల ఉబ్బసాన్ని సులువుగా అధిగమించవచ్చు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ సర్కార్ ఐపిఎస్ విషయంలో ఇబ్బంది పడుతుందా...?

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?

హెరాల్డ్ స్మ‌రామీ : పెత్తాందారీపై సాయుధ‌పోరాటం చేసిన పైలా వాసుదేవ‌రావు

వకీల్‌ సాబ్‌ నెగిటివ్ రివ్యూ - సోషల్ మీడియాలో తెగ వైరల్ ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?

బైరెడ్డి సిద్ధార్థ్‌కి ఆ ఛాన్స్ ఉందా?

రెండు రోజుల్లోనే మిలియన్ లైక్ సంపాదించుకున్న పుష్ప టీజర్ ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>