Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/allam2cca480c-8be6-45f4-b148-049d37103181-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/allam2cca480c-8be6-45f4-b148-049d37103181-415x250-IndiaHerald.jpgఅల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. మరి అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దామా...! allam;survey;heart;cancer;ginger;sugar;aqua;cholesterol;insulin;chris lynnఅల్లంతో గుండె సమస్యలు దూరం...?అల్లంతో గుండె సమస్యలు దూరం...?allam;survey;heart;cancer;ginger;sugar;aqua;cholesterol;insulin;chris lynnSun, 11 Apr 2021 06:00:00 GMTఅల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. మరి అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దామా...!


మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. అలాగే, మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని మీరు డైట్‌గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి.అలాగే వ్యాయమం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.


వేడి వేడి అల్లం టీ తాగడానికి శీతాకాలం బెస్ట్ కానీ సీజనల్ చేంజెస్‌లో వచ్చే జలుబు అన్ని కాలాల్లోనూ వస్తూనే ఉంటుంది. ఈ జలుబు కి మంచి మందు అల్లం టీ. ఇది తాగగానే చెమట పోస్తుంది, అలా జరగడం మంచిదని నిపుణులు అంటారు. అల్లం కొలెస్ట్రాల్ తగ్గించి బ్లడ్ క్లాట్స్ ఏర్పడే రిస్క్ ని రెడ్యూస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి మీ రోజు వారీ ఆహారం లో కొద్దిగా అల్లం చేర్చుకోవడం ఎంతో మంచిది.



ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియలో వైట్ బ్లడ్ సెల్స్ మనని ఇన్‌ఫెక్షన్, వైరస్‌ల నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఒక్కోసారి ఇది సరిగ్గా జరగకపోతే చాలా సివియర్ గా జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇలా జరిగినప్పుడు శరీరం లోని రోగ నిరోధక వ్యవస్థ తన సెల్స్ ని తనే డ్యామేజ్ చేసుకుంటుంది. అల్లం లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ ఇన్‌ఫ్లమేషన్ ని క్యూర్ చేస్తాయి.కొన్ని పరిశోధనల ప్రకారం అల్లం ప్రోస్టేట్ క్యాన్సర్ సెల్స్ ని బ్లాక్ చేస్తుందని తెలిసింది. అంతే కాక ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఇది ఎలాంటి క్యాన్సర్ వచ్చే రిస్క్ ని అయినా తగ్గిస్తుంది.


అల్లం మజిల్ పెయిన్ ని క్యూర్ చేయడం లో కూడా సహాయం చేస్తుంది. రోజూ కొద్దిగా అల్లం తీసుకునే వారిలో మజిల్ పెయిన్ బాగా కంట్రోల్ లో ఉంటుంది.తీసుకున్న ఆహారం సరిగా అరగకపోవడం అనే సమస్య తరచూ వస్తూ ఉంటే దానితో పాటు కడుపు నొప్పి కూడా ఉంటుంది. పొట్ట పై భాగం లో అసౌకర్యంగా అనిపిస్తుంది. అల్లం జీర్ణ క్రియ సరిగా జరిగేలా చూడడమే కాక కాన్స్టిపేషన్ సమస్యని కూడా నివారిస్తుంది. మీకు వికారంగా అనిపించినా, వాంతి అయ్యేలా ఉన్నా, నోరు అరుచిగా ఉన్నా మీకు అల్లం కావాలి. కొద్దిగా పచ్చి అల్లాన్ని అలానే నమలండి, లేదా వేడి వేడి అల్లం టీ తాగండి. అలాగే, ప్రయాణం లో కొంత మందికి వాంతులు అవుతూ ఉంటాయి, వారికి కూడా అల్లం బాగా హెల్ప్ చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ తెరపైకి మహేష్, సుక్కు కాంబినేషన్..సెట్టయ్యేనా..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>