PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19e12e8a98-2628-4a44-a9a7-b459024461f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19e12e8a98-2628-4a44-a9a7-b459024461f7-415x250-IndiaHerald.jpgకరోనా కొత్త రకాలు కూడా తాజా ఉద్ధృతికి దోహదపడి ఉంటాయని జమీల్, జాన్‌లు చెప్పారు. పంజాబ్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌ల వాటా 80 శాతం ఉందన్నారు. దీనికితోడు రెండు ఉత్పరివర్తనలు కలిగిన ఒక కొత్త రకం వైరస్‌.. భారత్‌లో ఆవిర్భవించిందని చెప్పారు. COVID19;india;maharashtra - mumbai;january;capital;tamilnadu;population;maharashtra;doctor;marchభారత్ లో కరోనా కల్లోలానికి కారణాలు!భారత్ లో కరోనా కల్లోలానికి కారణాలు!COVID19;india;maharashtra - mumbai;january;capital;tamilnadu;population;maharashtra;doctor;marchSun, 11 Apr 2021 09:56:27 GMTభారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా 794 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో  కొత్తగా 55, 411 కరోనా కేసులు నమోదుకాగా 309 మంది మరణించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఒక్కరోజే 9,327 మంది కరోనా బారినపడగా.. 50 మంతి మృతి చెందారు. గుజరాత్‌లో 5,011 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మృతిచెందారు. తమిళనాడులో కొత్తగా 5,989 మంది కరోనా బారిన పడగా.. 23 మంది మృత్యువాత పడ్డారు.

భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరగడానికి అనేక కారణాలను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్నారు. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు కారణమవుతున్నాయని చెప్పారు. టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు కారణమే. భారత్‌లోని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్‌ జమీల్, టి.జాకొబ్‌ జాన్‌లు దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. రాబోయే కొద్ది నెలల్లో వైరస్‌ కొత్త ఉత్పరివర్తనలపై టీకాలు ఎలా పనిచేస్తాయన్నదానిపైనే భవిష్యత్‌లో కొవిడ్‌ తీరుతెన్నులు ఉంటాయని చెప్పారు.  మొదటి ఉద్ధృతి తర్వాత కూడా.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారని జమీల్‌ తెలిపారు. మొదటి ఉద్ధృతి తర్వాత అనేక మందిలో అలసత్వం పెరిగిందని చెప్పారు. తాజా విజృంభణకు ఇదే ప్రధాన కారణమన్నారు డాక్టర్ జమీల్.

టీకా పొందాక కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు సరిగా ప్రచారం చేయలేదన్నారు డాక్టర్లు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని జమీల్‌ చెప్పారు. జనవరి మధ్యలో టీకాలు మొదలుపెట్టిన సమయంలో రోజువారీ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా అర్హులైన కొందరు టీకాలపై విముఖత చూపారు. మార్చి మొదటినుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టినప్పటికీ 60ఏళ్లు పైబడినవారిలోనూ పలువురు వ్యాక్సిన్లపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. మరోపక్క దేశంలో 0.7 శాతం మంది మాత్రమే టీకాకు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నారు. 5 శాతం మందికి ఒక డోసు అందింది. అందువల్లే వ్యాక్సినేషన్‌ ఫలితాలు పెద్దగా కనిపించడంలేదని వివరించారు.  

కరోనా కొత్త రకాలు కూడా తాజా ఉద్ధృతికి దోహదపడి ఉంటాయని జమీల్, జాన్‌లు చెప్పారు. పంజాబ్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌ల వాటా 80 శాతం ఉందన్నారు. దీనికితోడు రెండు ఉత్పరివర్తనలు కలిగిన ఒక కొత్త రకం వైరస్‌.. భారత్‌లో ఆవిర్భవించిందని చెప్పారు. మహారాష్ట్రలో జన్యుక్రమాలను పరిశీలించిన కొత్త కేసుల్లో 15-20 శాతం వాటాను ఇదే ఆక్రమించిందని తెలిపారు. ఈ రెండు కాక.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు కూడా ఉన్నాయన్నారు. బ్రిటన్‌ రకం.. 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఉద్ధృతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలను ఇస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వాలని జమీల్‌ కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోయపాటి రికార్డును బ్రేక్ చేయలేకపోతున్న జక్కన్న.. ఎందులోనో తెలుసా..?

తిరుపతిలో టీడీపీ ఓట్లకు భారీ చిల్లు ?

దుమ్మురేపుతోన్న వ‌కీల్‌సాబ్... యూఎస్ & ఆస్ట్రేలియా క‌లెక్ష‌న్లు అదుర్స్

వైసీపీకి గురుమూర్తి బలమా..? భారమా..?

ఓహో.. జగన్‌ వకీల్‌సాబ్‌ను టార్గెట్ చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

వకీల్ సాబ్ : కొంప ముంచిన ఏపీ సర్కార్, నాలుగో స్థానంలో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>