HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chiya-subja-ginjalu-differentes62200543-6714-4e2f-8bf3-817fc5043f4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chiya-subja-ginjalu-differentes62200543-6714-4e2f-8bf3-817fc5043f4f-415x250-IndiaHerald.jpgసబ్జా గింజలు ఎండా కాలానికి పెట్టిన పేరు. చల్లని నీటిలో సబ్జా గింజలు వేసుకొని, నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. అంతేకాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. సాధారణంగా ఎవరికైనా శరీరంలో వేడి చేసింది అంటే మాత్రం మొదట గుర్తొచ్చే మాట సబ్జాగింజలు తినమని చెబుతుంటారు. ఈ సబ్జా గింజలనే తీపి తులసి గింజలు అని కూడా అంటారు. ఇవి మన భారత దేశానికి చెందినవి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా ఎంCHIYA,SUBJA,GINJALU DIFFERENTES;tara;thulasi;tulasi;sugar;aquaసబ్జా గింజలకు, చియా గింజలకు కు మధ్య తేడా ఏంటి..? ఏవి బెటర్..సబ్జా గింజలకు, చియా గింజలకు కు మధ్య తేడా ఏంటి..? ఏవి బెటర్..CHIYA,SUBJA,GINJALU DIFFERENTES;tara;thulasi;tulasi;sugar;aquaSat, 10 Apr 2021 11:40:00 GMT
సబ్జా గింజలు ఎండా కాలానికి పెట్టిన పేరు. చల్లని నీటిలో సబ్జా గింజలు వేసుకొని, నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది. అంతేకాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. సాధారణంగా ఎవరికైనా శరీరంలో వేడి చేసింది అంటే మాత్రం మొదట గుర్తొచ్చే మాట సబ్జాగింజలు తినమని చెబుతుంటారు. ఈ సబ్జా గింజలనే తీపి తులసి గింజలు అని కూడా అంటారు. ఇవి మన భారత దేశానికి చెందినవి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో ఎక్కువగా చాలామంది ఎండదెబ్బకు, వడదెబ్బకు గురవుతారు. అలాంటి వారు ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ,జీర్ణ సమస్యలు,జుట్టు రాలడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.

ఇక చియా గింజలు విషయానికి వస్తే, ఇవి మెక్సికోలో పుట్టాయి. ఇందులో ఫైబర్,ఒమేగా త్రీ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి, డయాబెటిస్  రాకుండా చేస్తాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలాబాగా పనిచేస్తాయి.

ఇక ఈ రెండింటి విషయానికొస్తే, సబ్జా గింజలు నలుపు రంగులో ఉంటే, చియా గింజలు బూడిద రంగులో ఉంటాయి. ఈ చియా గింజలు అండాకారంలో సబ్జా గింజల కంటే పెద్దగా కనిపిస్తాయి. చియా గింజలు నీటిలో వేసిన కొద్దిసేపటి తరువాత నెమ్మదిగా నీటిని పీల్చుకుంటాయి. ఇక అంతే కాకుండా వీటి బరువు కంటే పది రెట్లు అధిక బరువు పెరిగి, నీటి అడుగుకు వెళ్లి జిగట గా మారుతాయి. ఇక సబ్జా గింజలు మాత్రం నీటిలో వేయగానే, కొంతసేపటికి చుట్టూ ఒక పారదర్శక పొర ను ఏర్పాటు చేసుకుంటాయి.

ఇక వీటి ఉపయోగాలు విషయానికొస్తే చియా గింజలను అలాగే తినవచ్చు. కానీ సబ్జా గింజలు నీటిలో నానబెట్టి మాత్రమే తినాలి. ఇవి నేరుగా తింటే చాలా ప్రమాదకరం. ఇక పోషకాల విషయానికి వస్తే దేనికదే సాటి. రెండింటిలోనూ సమానమైన పోషకాలు కలిగి ఉంటాయి. అయితే బరువు తగ్గించడంలో మాత్రం సబ్జా గింజల కంటే చియా గింజలు బెటర్ అని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

తగ్గేదే లే.. ఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన బన్నీ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>