Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/food9a048e8c-f36a-41af-977a-6118afed251c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/food9a048e8c-f36a-41af-977a-6118afed251c-415x250-IndiaHerald.jpgసాధారణంగా వయసు పెరిగే కొద్దీ.. స్త్రీ శరీరంలో బాహ్య, అంతర్గత మార్పులు అనేకం చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా 50 ఏళ్ళ వయసు చేరుకున్న మహిళల్లో మైనోపాజ్ దశకు చేరువ అవుతారు. దీంతో జీవ క్రియ తగ్గుతుంది. ఇక కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా మహిళలు వారి శారీరక అవసరాలకు తగినట్లు ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఈ దశలోని మహిళలు తినే ఆహారం వారి చర్మం , శరీరం తీరును ప్రతిబింబించే విధంగా ఉfood;women;tara;vitamin;heart;cancer;sugar;woman;salt;stree;office;protein50 ఏళ్లు పైబడిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి...?50 ఏళ్లు పైబడిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి...?food;women;tara;vitamin;heart;cancer;sugar;woman;salt;stree;office;proteinSat, 10 Apr 2021 07:00:00 GMT
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ.. స్త్రీ శరీరంలో బాహ్య, అంతర్గత మార్పులు అనేకం చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా 50 ఏళ్ళ వయసు చేరుకున్న మహిళల్లో మైనోపాజ్ దశకు చేరువ అవుతారు. దీంతో జీవ క్రియ తగ్గుతుంది. ఇక కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా మహిళలు వారి శారీరక అవసరాలకు తగినట్లు ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఈ దశలోని మహిళలు తినే ఆహారం వారి చర్మం , శరీరం తీరును ప్రతిబింబించే విధంగా ఉండాలి. అందుకనే 50ఏళ్ళు వచ్చిన మహిళ తినే ఆహారం ఎంపిక చాలా ముఖ్యం. 50ఏళ్ళు వచ్చిన ప్రతి స్త్రీ తినే ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులను గురించి ఈరోజు తెలుసుకుందాం..!



మహిళల్లో 30 ఏళ్లు దాటితే వారిలో కండరాలు బలహీనపడటం సహజమే. సుమారు 3 నుంచి 8 శాతం వరకు వారిలో కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత కండరాలు క్షీణించే రేటు అనూహ్యంగా మరింత పెరుగుతుంది. ఇక 80 ఏళ్లు వచ్చేసరికి కండరాల్లో బలం సగం క్షీణిస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో తక్కువ చలనం, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమే. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను నిరోధించవచ్చు.



50 ఏళ్లు దాటిన మహిళలు వారు పెరిగే ప్రతి కిలోగ్రాము బరువుకు 1 నుంచి 1.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గి వారు ఆస్టియోపోరోసిస్ బారిన పడుతుంటారు. చాలా మంది మహిళల్లో ఎముకలు బాగా బలహీనంగా, సన్నగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆస్టియోపోరోసిస్ అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహిళలు మోనోపాజ్ దశ వల్ల వారు బలహీనపడటానికి మరో కారణం. అందుకే మహిళల్లో ఎముకలు గట్టిపడాలంటే వారు మరింత కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 50 ఏళ్ల లోపు మహిళలకు రోజుకు కనీసం 1,000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.



50 ఏళ్లు పైబడిన వారికి అయితే శరీరంలో రోజుకు కనీసం 1,200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. మహిళలు ముఖ్యంగా తాము తినే ఆహార పదార్థాలలో ఉప్పు శాతం తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటే బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారు. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలతో పాటు హైపర్ టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి మహిళలు తినే ఆహారంలో రోజుకు 1,500 మిల్లీ గ్రాములలోపే సోడియం శాతం ఉండాలి. ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉన్న మహిళలు ఉప్పుకు బదులుగా ఇతర మూలికలు, మసాల దినుసులు వాడితే ఉపయోగకరంగా ఉంటుంది.సాధారణంగా వయసు పెరిగే కొద్ది మెదడు పనితీరులో కూడా మార్పులు వస్తుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మార్పులు ఎక్కువ.


50 ఏళ్లు దాటినవారిలో మతిమరుపు పెరగడంతో పాటు ఏకాగ్రత తగ్గుతుంటుంది. మెదడు సరిగ్గా పనిచేయాలంటే ఆహారంలో విటమిన్ B12 ఉండాలి. విటమిన్ B12 అనేది ఎక్కువగా జంతు ఆధారిత ఆహార ఉత్పత్తుల్లో ఉంటుంది. శాకాహారులు అయితే ప్రత్యామ్పాయ ఆహారాలు తీసుకోవచ్చు. సాధారణంగా మానవుల శరీరంలో విటమిన్ B12 చాలా ఏళ్లు నిల్వ ఉంటుంది. 50 సంవత్సరాలు పైబడిన మహిళలు విటమిన్ B12ను ప్రతిరోజూ 2.4 మైక్రోగ్రాములు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.సాధారణంగా అన్ని వయసుల వారిలో విటమిన్ D లోపం ఉంటుంది. విటమిన్ D ఎక్కువగా సూర్యరశ్మి ద్వారా లభించే వనరు.


కానీ ఎక్కువ మంది ఇళ్లు, ఆఫీసులకే అతుక్కుపోతున్నారు. బయట ప్రయాణించే సయయంలో కూడా ఎక్కువగా కార్లు, ఆటోలకే ప్రాధాన్యమిస్తున్నారు.దీంతో విటమిన్ D బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. విటమిన్ D శరీరంలోని అనేక అంతర్గత విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు, ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్, క్యాన్సర్, బరువు పెరగకుండా నిరోధించడంలో విటమిన్ D సహాయపడుతుంది. 50 కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల్లో విటమిన్ D ఎక్కువగా ఉండాలి. 50 ఏళ్లు పైబడిన వారిలో ప్రతిరోజు విటమిన్ D 600 IU ఉండాలి. అదే 70 ఏళ్లు పైబడిన వారిలో విటమిన్ D 800 IU ఉండాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"వకీల్ సాబ్" డైరెక్టర్ పై స్టార్ హీరోల దృష్టి..?

ఇది పింక్ రీమేక్ కాదు.. పవన్ కళ్యాణ్ సినిమా.. అంతే!

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ జీవో, కోర్టుకు వెళ్ళే యోచనలో థియేటర్ ఓనర్స్ ?

వైసీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్‌ను జైలుకు పంపుతుందా..?

షర్మిల వ్యూహంతో టీఆర్ఎస్ ఇరుకున పడినట్టేనా..?

ఎన్టీఆర్ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆనం పెంచుతారా? తగ్గిస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>