PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-bjp2a740881-2adf-4b29-b308-a673914daf68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-bjp2a740881-2adf-4b29-b308-a673914daf68-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కి కచ్చితంగా వారం కూడా గడువు లేదు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత నుంచి చూస్తే ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి. రాజకీయంగా కూడా అనేక సమీకరణలు చోటు చేసుకున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ఒకే ఒక సభలో పవన్ పాలుపంచుకున్నారు tirupati bjp;pawan;tiru;bharatiya janata party;jagan;janasena;cinema;tirupati;husband;janasena partyతిరుపతిలో పోరులో పవన్ ఫ్యాక్టర్...?తిరుపతిలో పోరులో పవన్ ఫ్యాక్టర్...?tirupati bjp;pawan;tiru;bharatiya janata party;jagan;janasena;cinema;tirupati;husband;janasena partySat, 10 Apr 2021 15:17:10 GMTతిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కి కచ్చితంగా వారం కూడా గడువు లేదు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత నుంచి చూస్తే ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి. రాజకీయంగా కూడా అనేక సమీకరణలు చోటు చేసుకున్నాయి.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ఒకే ఒక సభలో పవన్ పాలుపంచుకున్నారు. దానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఆ మీదట పవన్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయి దుమ్ము రేపింది. ఇంతటి క్రేజ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకూ రాలేదు అనిపించేలా పవన్ వకీల్ సాబ్ రీసౌండ్ చేశాడు. ఇక వకీల్ సాబ్ కి ఏపీలో అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మనీయకుండా జగన్ సర్కార్ అడ్డుకుంది. దాంతో జనసైనికులకు మండుకొస్తోంది. మామూలుగా అయితే పవన్ ఫ్యాన్స్ వివిధ పార్టీలలో ఉన్నారు. గత ఎన్నికల్లో వారు తమ ఓటుని వైసీపీకి వేసిన సందర్భం కూడా ఉంది. కానీ ఇపుడు పవన్ సినిమాను అడ్డుకుంటే ఆ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. పైగా తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది.

దాంతో పవన్ ఫ్యాన్స్ ఓట్లు అన్నీ గంపగుత్తగా బీజేపీకే పడతాయా య లేక టీడీపీకి కూడా వేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో వైసీపీకి ఒక సామాజిక వర్గం ఓట్లు పెద్దగా పడతాయా లేదా అన్న చర్చ కూడా ముందుకువస్తోంది. పవన్ వకీల్ సాబ్ సినిమా హిట్ కావడమే కాదు, ఏపీలో చెలరేగుతున్న రాజకీయ వివాదం కూడా ఇపుడు బీజేపీకి వరంగా మారుతోంది అంటున్నారు. నిజానికి జనసేన ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీకి మళ్ళుతాయా లేదా అన్న డౌట్ ఆ పార్టీలో కూడా ఉంది. కానీ బీజేపీ నేతలు వకీల్ సాబ్ కి ఏపీలో ఇబ్బందుకు సృష్టిస్తున్నారు అంటూ మద్దతుగా నిలవడంతో పవన్ ఫ్యాన్స్ తిరుపతిలో బీజేపీకి మద్దతు ఇస్తారు అంటున్నారు. దాంతో బీజేపీ ఎన్నికల్లో పెద్ద గండం గట్టెక్కేసినట్లే అని అంటున్నారు. బీజేపీ గెలవకపోయినా గౌరవప్రదమైన ఓట్లు ఆ పార్టీకి దక్కుతాయి అని  విశ్లేషణలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏ జరుగుతుందో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ టార్గెట్‌గా ష‌ర్మిల కొత్త స్కెచ్‌

"డిజాస్టర్ వకీల్ సాబ్" వారి పనేనా ?

వకీల్ సాబ్ నెగటివ్ పాయింట్స్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తాయా?

టీడీపీ నేతలతో బాబు అర్జెంట్ మీటింగ్...?

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>