MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/herald-mla-progress-venkatagiri-mla-anam-ram-narayanareddy73d8510f-96c2-4f06-927d-db75a91de9c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/herald-mla-progress-venkatagiri-mla-anam-ram-narayanareddy73d8510f-96c2-4f06-927d-db75a91de9c1-415x250-IndiaHerald.jpgఆనం రామనారాయణరెడ్డి…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆనం. నెల్లూరు జిల్లా రాపూర్(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 1985లో విజయం సాధించి...ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి 1994 ఎన్నికల్లో అదే రాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.aanam ramanarayanareddy;ntr;kiran kumar;kumaar;anil music;jeevitha rajaseskhar;kiran;ramakrishna;tiru;jagan;andhra pradesh;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;y. s. rajasekhara reddy;congress;2019;mp;district;telugu;nellore;tirupati;mla;minister;fort;husband;tdp;nandamuri taraka rama rao;anil kumar singhal;venkatagiri;reddy;anam rama narayana reddy;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆనం పెంచుతారా? తగ్గిస్తారా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆనం పెంచుతారా? తగ్గిస్తారా?aanam ramanarayanareddy;ntr;kiran kumar;kumaar;anil music;jeevitha rajaseskhar;kiran;ramakrishna;tiru;jagan;andhra pradesh;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;y. s. rajasekhara reddy;congress;2019;mp;district;telugu;nellore;tirupati;mla;minister;fort;husband;tdp;nandamuri taraka rama rao;anil kumar singhal;venkatagiri;reddy;anam rama narayana reddy;partySat, 10 Apr 2021 05:00:00 GMTఆనం రామనారాయణరెడ్డి…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆనం. నెల్లూరు జిల్లా రాపూర్(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 1985లో విజయం సాధించి...ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి 1994 ఎన్నికల్లో అదే రాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


ఇక 1999, 2004 ఎన్నికల్లో రాపూర్ నుంచి, 2009 ఎన్నికల్లో ఆత్మకూరు స్థానం నుంచి గెలిచి వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఇక 2014 ఎన్నికల తర్వాత ఆనం టీడీపీలోకి వచ్చేశారు. అయితే నాలుగేళ్ళు టీడీపీలో గడిపిన ఆనం....2018లో వైసీపీలోకి వచ్చేసి. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కురుగొండ్ల రామకృష్ణపై 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.


అయితే సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారు. కానీ జగన్ నెల్లూరులో మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్‌కు పదవి ఇచ్చారు. ఇక వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు...నియోజకవర్గంలో పనులు చేసుకోవడానికి అధికారులు సహకరించడం లేదని పలుమార్లు...బహిరంగంగానే విమర్శలు చేశారు. జిల్లాలో మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గంతో ఆనంకు అసలు పడటం లేదని టాక్.


ఒకానొక సమయంలో ఆనం, మంత్రి అనిల్‌పైనే డైరక్ట్‌గా విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. నెల్లూరు సిటీ, రూరల్‌లో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మాట్లాడారు. అయితే ఇలా పార్టీలో లుకలుకలు నడుస్తుండటంతో జగన్ క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆ గొడవలు కాస్త సద్దుమణిగాయి. ఇక వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్‌లో ఉంది. ఇప్పుడు తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈ ఎన్నికలో వైసీపీకి వెంకటగిరి నుంచి ఎంత మెజారిటీ వస్తుందనేది చూడాలి. ఆనం సైతం పార్టీ కోసం గట్టిగానే కష్టపడి మంచి మెజారిటీ దక్కేలా చేస్తారా? అనేది కూడా చూడాలి.


అటు వెంకటగిరిలో టీడీపీ నేత కురుగొండ్ల రామకృష్ణ కాస్త పుంజుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. తిరుపతి పార్లమెంట్‌లో టీడీపీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. మరి చూడాలి వెంకటగిరిలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్...?

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>