Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/thieft817ea181-3c60-48fa-a6e2-5025d6f0f42e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/thieft817ea181-3c60-48fa-a6e2-5025d6f0f42e-415x250-IndiaHerald.jpg ఆస్తికుడో నాస్తికుడో తెలీదుకాని గుడిలో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగని పట్టించి దేవుడు తనేంటో నిరూపించుకున్నాడు. అయితే డబ్బులు అవసరమయిన ఆ దొంగ జనాలు ఎక్కువగా ఉండని ఓ గుడిని టార్గెట్ చేసుకున్నాడు. తన సహచర దొంగతో కలిసి అర్థరాత్రి గుడిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వెంటనే ఎదురుగా..thieft;deva;korba;police;thief;letter;local language;house;dongaగుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు.. దేవుడు శిక్షించాడుగుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు.. దేవుడు శిక్షించాడుthieft;deva;korba;police;thief;letter;local language;house;dongaSat, 10 Apr 2021 20:57:23 GMTఇంటర్నెట్ డెస్క్: ఆస్తికుడో నాస్తికుడో తెలీదుకాని గుడిలో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగని పట్టించి దేవుడు తనేంటో నిరూపించుకున్నాడు. అయితే డబ్బులు అవసరమయిన ఆ దొంగ జనాలు ఎక్కువగా ఉండని ఓ గుడిని టార్గెట్ చేసుకున్నాడు. తన సహచర దొంగతో కలిసి అర్థరాత్రి గుడిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వెంటనే ఎదురుగా ఉన్న దేవుడి హుండీలో చెయ్యి పెట్టాడు. ఇక అంతే తెల్లవారే వరకు ఉండి పోయాడు.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌ కోర్బాలోని ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దొంగను దేవుడే స్వయంగా శిక్షించాడు. అయితే దొంగతనం చేసేందుకు తన సహచరుడితో కలిసి సర్వం సిద్దమయిన దొంగ సరైన సమయం చూసుకుని ఆలయంలోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లిన అతడు తన చేతిని హుండీలోకి పెట్టాడు. అనంతరం అతడికి ఊహించని షాక్ తగిలింది. హుండీలో పెట్టిన చెయ్యి తిరిగి బయటకు రావడంలేదు. పెట్టిన చెయ్యి పెట్టినట్లే హుండీలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి తీసేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగలు చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఫలితం లేకపోయింది.

కాగా.. తెల్లవారుజామున ఈ సంఘటన చూసిన స్థానికులు మొదట విస్తుబోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ విషయం విన్న స్థానిక ప్రజలందరూ కూడా తన ఇంట్లో పడిన దొంగలను దేవుడే పట్టించాడని, ఆ దొంగలకు భగవంతుడు సరైన శిక్ష విధించాడని అంటున్నారు. ఈ ఘటన కోర్బా నగరంలోని పవర్ హౌస్ రోడ్‌లో ఉన్న శ్రీ సిద్ధ వతేశ్వర్ హనుమాన్ శని ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

అందుకే ఏకళలో అయినా.. నైపుణ్యం సంపాదించాలి. లేకపోతే ఇలానే దొరికిపోతారు. కానీ ఆలయంలోనే ఇలా దొంగతనానికి ట్రై చేయడంతో స్థానికులంతా సదరు దొంగపై మండిపడుతున్నారు అయితే పోలీసులు సరైన సమయానికి చేరుకోవడంతో దేహశుద్ధి జరగకుండా దొంగ తప్పించుకున్నాడు.

" style="height: 369px;">


">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ వెంట పడ్డ జగన్ టీమ్.. ఏం చేశారో తెలుసా..?

వకీల్ సాబ్ మొదటిరోజు కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

వకీల్ సాబ్ పై మండిపడుతున్న నెటిజన్స్... ఈ పరిస్థితిలో ఈ సినిమాకి ఇంత హడావిడి అవసరమా?

'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ..ఇండ్రస్టీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్..

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. శృతి మాకొద్దు బాబోయ్ అంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్...

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ డిలీటెడ్ సీన్లను యాడ్ చేస్తారట.. ఇక పూనకాలే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>