MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-a34d5881-b0b3-4047-a724-16191aea01c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-a34d5881-b0b3-4047-a724-16191aea01c7-415x250-IndiaHerald.jpg నిన్న ఉదయం నుండి మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వార్తలతో నిండిపోయింది. అలాంటి సమయంలో తమన్నా 70 అడుగుల కటౌట్ వార్తలు కూడ మీడియాలో ప్రముఖంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. నిన్నటి నుండి ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘లెవంథ్ అవర్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడం ప్రారంభం అయింది.ఇప్పటికే తన ఒరిజినల్ కంటెంట్ తో ఓటీటీ సంస్థలలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆహా ద్వారా ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూడటంతో ఈ కార్పొరేట్ వెబ్ సిరీస్ థ్రిvakeelsaab;;pawan;gopichand;kalyan;praveen;rani;tamannaah bhatia;tiru;bahubali;thriller;heroine;corporateపవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !vakeelsaab;;pawan;gopichand;kalyan;praveen;rani;tamannaah bhatia;tiru;bahubali;thriller;heroine;corporateSat, 10 Apr 2021 10:00:00 GMT
నిన్న ఉదయం నుండి మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వార్తలతో నిండిపోయింది. అలాంటి సమయంలో తమన్నా 70 అడుగుల కటౌట్ వార్తలు కూడ మీడియాలో ప్రముఖంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. నిన్నటి నుండి ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘లెవంథ్ అవర్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడం ప్రారంభం అయింది.


ఇప్పటికే తన ఒరిజినల్ కంటెంట్ తో ఓటీటీ సంస్థలలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆహా ద్వారా ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూడటంతో  ఈ కార్పొరేట్ వెబ్ సిరీస్ థ్రిల్లర్ తో తమన్నా కెరియర్ మరో మలుపు తిరుగుతుంది అన్న అంచనాలు వచ్చాయి.



దీనికి తగ్గట్టుగానే కార్పోరేట్ రంగంలో గెలుపే ధ్యేయంగా పోరాటం చేస్తూ ఒక కంపెనీ యజమానురాలిగా తమన్నా లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నిర్మింపబడ్డ ఈ వెబ్ సిరీస్ ను నిర్మాణ విలువలలో ఎటువంటి రాజీ పడకుండా ఆహా సంస్థ నిర్వాకులు నిర్మించారు. ‘బాహుబలి’ తరువాత తమన్నాకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చినా హీరోయిన్ గా ఆమె పెద్దగా రాణించలేకపోయింది. దీనికితోడు యంగ్ హీరోయిన్స్ తాకిడి కూడ బాగా పెరిగి పోవడంతో తమన్నా క్రేజ్ రోజురోజుకు తగ్గి పోతోంది.


ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు ఎవరు ఆమెతో నటించకడానికి ఆశక్తి కనపరచకపోవడంతో ఆమె గోపీచంద్ లాంటి ఫెయిల్యూర్ హీరోతో నటించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత తరం ప్రేక్షకులు ఓటీటీ లలో వెబ్ సిరీస్ లను బాగా చూస్తున్న పరిస్థితులలో ఈ వెబ్ సిరీస్ విజయవంతం అయితే మళ్ళీ ఆమెకు తిరిగి మంచి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం నక్లీస్ రోడ్ లో ఏర్పాటు చేయబడ్డ ఈ 70 అడుగుల తమన్నా కటౌట్ ను జనం చాల ఆసక్తిగా చూస్తూ ‘వకీల్ సాబ్’ విషయాలతో పాటు తమన్నా కటౌటు గురించి కూడ అంతే ఆశక్తిగా మాట్లాడుకుంటున్నారు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియాలో కరోనా కొత్త రికార్డ్

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?

వకీల్ సాబ్ సినిమా చూసిన పవన్ అభిమాని పనికి దిల్ రాజు షాక్..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>