PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d3424214-1a14-4ed5-8a00-8a528869f6f2-415x250-IndiaHerald.jpgగ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయినా.. ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఒంగో లు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఒక ఎంపీగా.. ఆయ‌న ఎప్పుడూ మీడియా ముందుకు రా వ‌డం కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కామెంట్లు చేయ‌డం కానీ లేదు. కానీ, ఇత‌ర ఎంపీల్లో కొంద‌రు మాత్రం దూకు డుగానే ఉన్నారు. మాగుంట మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. దీనికి కార‌ణం ఏంటి? అనేది స‌హ‌జంగానే చ‌ర్చ‌కు వ‌చ్చే అంశం. స‌హ‌జంగానే ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడు కావ‌డంతో సంస్థాగ‌తంగా వైసీపీ YSRCP;2019;mp;district;government;yv subbareddy;media;letter;ycp;research and analysis wing;reddy;y v subbareddy;dookudu;partyఆ వైసీపీ ఎంపీ మౌనం వెనుక‌.. ఇమ‌డ లేక‌పోతున్నారా ?ఆ వైసీపీ ఎంపీ మౌనం వెనుక‌.. ఇమ‌డ లేక‌పోతున్నారా ?YSRCP;2019;mp;district;government;yv subbareddy;media;letter;ycp;research and analysis wing;reddy;y v subbareddy;dookudu;partySat, 10 Apr 2021 15:33:04 GMTప్ర‌కాశం జిల్లా ఒంగోలు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ మోస్ట్ పొలిటీషియ‌న్‌.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత .. నుంచి సైలెంట్ అయిపోయారు. వాస్త‌వానికి ఎప్పుడూ ఆయ‌న సైలెంట్‌గానే ఉంటారు. త‌న ప‌నితాను చేసు కుని పోతుంటారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలోకి చేరినా.. ఆయ‌న వివాదాల కు అతీతంగా ఉంటార‌నే పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న వ్యాపారాల విషయా న్ని కూడా ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకుంటారు.

ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న మాగుంట‌కు.. రాజ‌కీయంగా దూకుడు లేక‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో టికెట్  క‌న్ఫ‌ర్మ్ అయినా.. ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఒంగో లు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఒక ఎంపీగా.. ఆయ‌న ఎప్పుడూ మీడియా ముందుకు రా వ‌డం కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కామెంట్లు చేయ‌డం కానీ లేదు. కానీ, ఇత‌ర ఎంపీల్లో కొంద‌రు మాత్రం దూకు డుగానే ఉన్నారు. మాగుంట మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. దీనికి కార‌ణం ఏంటి? అనేది స‌హ‌జంగానే చ‌ర్చ‌కు వ‌చ్చే అంశం.

స‌హ‌జంగానే ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన నాయ‌కుడు కావ‌డంతో సంస్థాగ‌తంగా వైసీపీ పుట్టినప్ప‌టి నుంచి ఉన్న నేత‌ల‌తో ఆయ‌న క‌ల‌వ‌లేక‌పోతున్నార‌నే వాద‌న ఉంది. దీనికితోడు ప్ర‌కాశంలో జ‌గ‌న్ బంధువులు.. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డిలే దూకుడుగా ఉన్నారు. దీంతో మాగుంట త‌న ప‌నేదో తాను  చేసుకుంటున్నారు. ఇక‌, త‌న వ్యాపార ప‌రంగా చూసుకుంటే.. ప్ర‌భుత్వం నుంచి స‌రైన ప్రోత్సాహం లేద‌నే బాధ ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. గ‌తంలో ఏ పార్టీలో ఉన్నా.. త‌మ ప్ర‌ధాన వ్యాపారం లిక్క‌ర్ బిజినెస్‌ను జాగ్ర‌త్త‌గా చేసుకునేవారు.

ఈ క్ర‌మంలోనే ఎప్పుడూ అధికారంలో ఉండాల‌ని కోరుకునేవారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌తో లిక్క‌ర్ వ్యాపారం న‌ష్టాల్లో ఉంద‌ని తెలుస్తోంది. మాగుంటకు బేవరేజెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రఖ్యాత బ్రాండ్ల మద్యం ఉత్పత్తి చేస్తూంటారు. వీటి అమ్మకాలను ఏపీలో చేయడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో సరఫరా చేసిన వాటికి చెల్లింపులు చేయాల్సి ఉంది. తాను అధికార పార్టీలోనే ఉన్నప్ప‌టికీ.. ఏమీ మాట్లాడ‌లేక పోవ‌డం.. త‌న వ్యాపారాల‌కే న్యాయం చేయ‌లేక పోవ‌డం వంటివి మాగుంట‌ను సైలెంట్ చేశాయ‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన వకీల్ సాబ్‌

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>