PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-announce-relief-to-teachers9c9b486f-c363-4800-a254-7af6c029ae0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-announce-relief-to-teachers9c9b486f-c363-4800-a254-7af6c029ae0f-415x250-IndiaHerald.jpgమ‌రోవైపు.. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు చెక్ పెట్టాలంటే.. వారికి దీటుగా జ‌వాబు చెప్పేవారితోపాటు.. ప్ర‌స్తుతం ఆ యా పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చుతూ.. ఏయే వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లువ‌స్తున్నాయో.. ఆయా వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కూడా కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ న చేయ‌నున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, స‌ర్కారు విష‌యానికి వ‌స్తే.. కొంత మంది మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే మరికొందరి తీరు వివాదాస్పదమయింది. ఈ కారణంగా ఓ అర‌డ‌జ‌నKCR;view;kcr;bharatiya janata party;telangana;minister;audio;cheque;letter;mantraకేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?KCR;view;kcr;bharatiya janata party;telangana;minister;audio;cheque;letter;mantraSat, 10 Apr 2021 16:40:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్‌.. త‌న మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారా?  కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తూనే.. ఇత ‌ర రాజ‌కీయ ప‌క్షాల‌కు చెక్‌పెట్టే దిశ‌గా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం స‌ర్కారు ఏర్ప‌డి రెండేళ్లు గ‌డిచిపోయి.. నాలుగు మాసాలు అయింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఒక సారి మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ చేప‌ట్టినా.. ఇప్పుడు ఆశావ‌హులు పెరుగుతుండ‌డం తో పాటు.. ఉన్న మంత్రుల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం.. మ‌రో కోణంగా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు.. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు చెక్ పెట్టాలంటే.. వారికి దీటుగా జ‌వాబు చెప్పేవారితోపాటు.. ప్ర‌స్తుతం ఆ యా పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చుతూ.. ఏయే వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లువ‌స్తున్నాయో.. ఆయా వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కూడా కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ న చేయ‌నున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, స‌ర్కారు విష‌యానికి వ‌స్తే..  కొంత మంది మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే మరికొందరి తీరు వివాదాస్పదమయింది. ఈ కారణంగా ఓ అర‌డ‌జ‌ను వ‌ర‌కు మంత్రుల‌ను మార్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తెలంగాణ మంత్రివర్గంలో కొంత మంది వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్‌ను వాటాల కోసం బెదిరించిన ఆడియో వైరల్ అయింది. ఇప్పటికే కేసీఆర్‌తో ఈటెల రాజేందర్‌కు గ్యాప్ పెరిగిపోయింది. అదేస‌మ‌యంలో హోం మంత్రితోనూ కేసీఆర్‌కు అవినాభావ సంబంధాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని చెబుతున్నారు.

దీంతో ఇలాంటి వారికి చెక్ పెట్ట‌డం తోపాటు.. ప‌నిచేయ‌ని వారిని కూడా ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో మెరుగైన ప‌నితీరు చూపించ‌ని వారిని కూడా ఇంటికి పంపించే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి కేసీఆర్ ప్ర‌క్షాళ‌న భారీ రేంజ్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన వకీల్ సాబ్‌

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్, ఐకాన్ పనులు మొదలు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>