Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/weight-loss00929dcf-1ab2-4ced-8346-20415f40e038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/weight-loss00929dcf-1ab2-4ced-8346-20415f40e038-415x250-IndiaHerald.jpg చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా బరువు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సులువు అవుతుంది. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... weight loss;tara;apple;aqua;cholesterol;pomegranateబరువు తగ్గాలనుకునేవారు... ఈ ఆహారాలను రోజు తీసుకోండి...?బరువు తగ్గాలనుకునేవారు... ఈ ఆహారాలను రోజు తీసుకోండి...?weight loss;tara;apple;aqua;cholesterol;pomegranateSat, 10 Apr 2021 02:00:00 GMT
 చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అయినా బరువు  తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఆరోగ్యకరమైన  ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సులువు అవుతుంది. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాంటి  ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు ఎక్కువగా పండ్లు,  కూరగాయలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా  తక్కువ క్యాలరీస్ ను అందిస్తాయి. ద్రాక్ష పండ్లు, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్ మరియు దానిమ్మ వంటి పండ్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

 రుణ ధాన్యాలను అల్పాహారాలు  తీసుకోవడం వల్ల బరువు తగ్గటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంటారు. ఇవి ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి. తృణ  ధాన్యాలను పెరుగు, పాలల్లో కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పాలలో తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. పోషకాలు కూడా ఉంటాయి.

 సాల్మన్ చేపలు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్సలిన్  విషయంలో ఎక్కువ  సున్నితంగా ఉండేలా పనిచేస్తాయి. అంతేకాకుండా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును  కరిగించడంలో  సాల్మన్ చేపలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

 బరువు తగ్గడానికి ఓట్ మీల్స్ మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. ఓట్ మీల్ తినడం వల్ల ఆరోగ్యకరమైన స్నాక్స్ కి దూరంగా ఉండేలా చేస్తుంది..

 సలాడ్స్ లో తోటకూర ను ఉపయోగించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగాను, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. టమోటా, క్యారెట్, దోసకాయ వంటి వెజిటబుల్ సలాడ్ శరీరానికి కావాల్సిన ఫైబర్ ను అందిస్తాయి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్ ను అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

 తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల సులువుగా  బరువు తగ్గొచ్చు . ఎంచుకొని తీసుకొనే ఆహారాలు జీర్ణక్రియ  సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. కాబట్టి పైన  చెప్పిన ఆహారాలను తీసుకొని  సులువుగా బరువు తగ్గండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీకి పోటీగా జనసేన....ఓటింగ్ శాతం తేల్చేసిందా?

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>