PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-ap731e2869-3a05-49fa-a9d5-441c4576b7d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-ap731e2869-3a05-49fa-a9d5-441c4576b7d4-415x250-IndiaHerald.jpg గూడు లేనివారంద‌రికీ ఒక గూడును క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో నివ‌సించే మధ్య తరగతి కుటుంబాలకు జ‌గ‌న్ స‌ర్కార్‌ శుభ‌వార్త చెప్పింది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్న‌వారికి వారు కోరుకున్న విధంగా 150, 200, 240 గ‌జాల చొప్పున ప్లాట్ల‌ను కేటాయించ‌నుంది. దీనికి సంబంధించి లేఔట్ల అభివృద్ధి, భూ సేకరణపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. స్థిరాస్తి వ్యాపారులు అమ్మే ధర కంటే తక్కువ ధ‌ర‌కు ఇళ్ల స్థలాలను మధ్య ఆదాయవర్jagan, ycp, ap;andhra pradesh;district;applicationమ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్లాట్లు కేటాయించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వంమ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్లాట్లు కేటాయించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వంjagan, ycp, ap;andhra pradesh;district;applicationSat, 10 Apr 2021 08:08:36 GMT
గూడు లేనివారంద‌రికీ ఒక గూడును క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో నివ‌సించే మధ్య తరగతి కుటుంబాలకు జ‌గ‌న్ స‌ర్కార్‌ శుభ‌వార్త చెప్పింది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్న‌వారికి వారు కోరుకున్న విధంగా 150, 200, 240 గ‌జాల చొప్పున ప్లాట్ల‌ను కేటాయించ‌నుంది. దీనికి సంబంధించి లేఔట్ల అభివృద్ధి,  భూ సేకరణపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. స్థిరాస్తి వ్యాపారులు అమ్మే ధర కంటే తక్కువ ధ‌ర‌కు ఇళ్ల స్థలాలను మధ్య ఆదాయవర్గాల ప్ర‌జ‌ల‌కు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో కొంత‌కాలం నుంచి నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటివరకు లక్ష మందికిపైగా మధ్య తరగతి కుటుంబాలు ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న‌ట్లు తేలింది. స‌ర్వేను విస్త్ర‌తం చేస్తే ఈ సంఖ్య ఇంకా  పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది.

అన్నీ స‌వ్యంగా ఉంటేనే ప్ర‌భుత్వ ఆమోదం
పాఠ‌శాల‌, ఆస్పత్రి, రవాణా వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా సేక‌రించే భూమి ఉండాలి. మాస్టర్‌ ప్లాన్ అమల్లో  ఉన్న చోట నివాస అవసరాల కోసం నిర్దేశించిన భూములు, స్థలాలు మాత్రమే భూ సేకరణకు తీసుకోవాలి. భూ సేకరణకు సంబంధించి జిల్లా కమిటీ నుంచి వచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా సవ్యంగా ఉందని భావిస్తేనే ప్రభుత్వ ఆమోదానికి పంపాలి. లేఔట్‌‌ను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌, మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ, ఏపీ టిడ్కోకు అప్పగించనున్నారు.

కుటుంబంలో ఒక‌రికి మాత్ర‌మే
దరఖాస్తు చేసుకునేవారి వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హుల‌వుతార‌ని ప్ర‌భుత్వం త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. కుటుంబంలో ఒకరికి మాత్ర‌మే ప్లాట్‌ కేటాయిస్తారు. మూడు కేటగిరీల్లో ఇళ్ల స్థలాలు విక్రయించబోతున్నారు. ఎంఐజీ-1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ-2లో 200చదరపు గజాలు, ఎంఐజీ-3లో 240 చదరపు గజాల‌ చొప్పున ప్లాట్ల‌ను కేటాయించ‌నున్నారు. 150 గజాల నుంచి 240 గజాల వరకు మూడు కేటగిరీలుగా ఎంఐజీ ప్లాట్లను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రూ. 3లక్షల నుంచి రూ. 18లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్‌లో 80వేల మంది పోలీసుల మొహ‌రింపు

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?

ఎమ్మెల్యేలతో బాబు అత్యవసర భేటీ...?

వకీల్ రచ్చపై పవన్ ఎందుకు స్పందించలేదంటే..?

గ్రామాల మీద జగన్ ఫోకస్... కొత్త నిర్ణయం...?

ఇది పింక్ రీమేక్ కాదు.. పవన్ కళ్యాణ్ సినిమా.. అంతే!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>