SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ugadhi-festival-importance64a0b0b7-1976-42fd-928b-20b9ff897933-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ugadhi-festival-importance64a0b0b7-1976-42fd-928b-20b9ff897933-415x250-IndiaHerald.jpgఉగాది...తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే విషయం ఉగాది పచ్చడి. షడ్ రుచుల కలయికతో తయారు చేసే ఈ పచ్చడి మానవుల జీవన శైలి ఎలా ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది. ఆరు రకాల వంట పదార్ధాలతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది.UGADHI-FESTIVAL-IMPORTANCE;jeevitha rajaseskhar;mithra;telugu;festival;santosham;anandamఉగాది రోజున చేయవలసిన పనులివే...?ఉగాది రోజున చేయవలసిన పనులివే...?UGADHI-FESTIVAL-IMPORTANCE;jeevitha rajaseskhar;mithra;telugu;festival;santosham;anandamSat, 10 Apr 2021 06:00:00 GMTఉగాది...తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే విషయం ఉగాది పచ్చడి. షడ్ రుచుల కలయికతో తయారు చేసే ఈ పచ్చడి మానవుల జీవన శైలి ఎలా ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది. ఆరు రకాల వంట పదార్ధాలతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వొగరు, చేదు వంటి ఆరు రకాల పద్దార్థాలను కలిపి తయారు చేస్తారు. ఈ ఆరు రకాల రుచులు లాగే జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతాయి అన్నింటినీ ఎదుర్కొని..ఆనందంగా స్వీకరించి ముందుకు సాగాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుందని దీని వెనుకున్న అర్ధం. ఉగాది నుండి మన తెలుగు వారి సంవత్సరం మొదలవుతుంది.

కాబట్టి ఇది తెలుగు వారికి మొదట వచ్చే పండుగ. ఎంతో విశిష్టమైనది కూడా, ఉగాది ప్రాముఖ్యం చైత్ర, శుద్ధ, పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం మొదలు పెట్టారన్నది  శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13 న ఉగాది పండుగ వచ్చింది. ఈ కాలంలో అన్ని చెట్లు చిగుర్లతో నూతన అందంతో ఎటు చూసిన ఎంతో పచ్చగా కనిపిస్తూ వెలిగి పోతుంటాయి. అయితే ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి..ఉగాది పండుగ నాడు తెల్లవారు జామునే లేచి  నువ్వుల నూనెను తలకు పట్టించి, సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఉగాది పండుగను తెలుగువారి నూతన సవంత్సరంగా భావిస్తాం కనుక తప్పకుండా  కొత్త బట్టలను ధరించాలి.

అంతేకాకుండా ఉగాది రోజు ప్రత్యేకించి నియమ నిబంధనల నడుమ పూజను ప్రారంభించాలి. ఉగాది పచ్చడి తప్పక తయారు చేసి మన బంధు మిత్రులకు ప్రేమగా పంచాలి. ఉగాది పర్వదినం నాడు పది మందికి భోజనం పెట్టి ఎంతో పుణ్యం వచ్చేలా చేసుకోవాలి. మీ జీవితంలో ప్రతి ఉగాది ఆచరిస్తే మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా అందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏప్రిల్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>