Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan14a34c22-9fb8-415f-87bc-7ad2a80ae9d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan14a34c22-9fb8-415f-87bc-7ad2a80ae9d0-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు సినిమాలు వరుసగా ఉండగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 అనగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.అయితే రెగ్యుల‌ర్ గా సినిమాలు వ‌చ్చిన‌ప్పుడే.. ప‌వ‌ర్ స్టార్ మేనియా ఆకాశాన్ని తాకేది. ఇప్పుడు.. మూడేళ్ల త‌ర్వాత తెర‌పై క‌నిపించ‌బోతున్నారు. ఇక‌, అభిమానుల హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదpawan kalyan;pawan;ananya pandey;prakash raj;shruti;shruti haasan;ananya;anjali;geetha;jeevitha rajaseskhar;kalyan;pawan kalyan;raj;ram pothineni;sree raam;sriram;sruthi;thaman s;hyderabad;janasena;tollywood;mp;cinema;sangeetha;telugu;marriage;court;episode;lawyer;nivetha thomas;pink;janasena party;naveen nuli;venu sreeram;divya bhatnagar;ananya nagallaవకీల్ సాబ్ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..?వకీల్ సాబ్ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..?pawan kalyan;pawan;ananya pandey;prakash raj;shruti;shruti haasan;ananya;anjali;geetha;jeevitha rajaseskhar;kalyan;pawan kalyan;raj;ram pothineni;sree raam;sriram;sruthi;thaman s;hyderabad;janasena;tollywood;mp;cinema;sangeetha;telugu;marriage;court;episode;lawyer;nivetha thomas;pink;janasena party;naveen nuli;venu sreeram;divya bhatnagar;ananya nagallaSat, 10 Apr 2021 04:00:00 GMT
 టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు సినిమాలు వరుసగా ఉండగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 అనగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.అయితే రెగ్యుల‌ర్ గా సినిమాలు వ‌చ్చిన‌ప్పుడే.. ప‌వ‌ర్ స్టార్ మేనియా ఆకాశాన్ని తాకేది. ఇప్పుడు.. మూడేళ్ల త‌ర్వాత తెర‌పై క‌నిపించ‌బోతున్నారు. ఇక‌, అభిమానుల హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే పవన్ కళ్యాణ్  మూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అయితే పవన్ అభిమానులు ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నారు అనేది ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..


 వకీల్ సాబ్ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే ఇందులో పవన్ కళ్యాణ్,శృతి హాసన్, నివేదాథామస్ అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు  రాజు శిరీష్. ఎడిటర్ నవీన్ నూలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జనం కోసం ఏదో ఒకటి చేయాలని తపించే మనిషి సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). అందుకే న్యాయవాది అవుతాడు. అదే సమయంలో శృతి హాసన్ ఆయన జీవితంలోకి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాలతో న్యాయవాద వృత్తికి దూరంగా ఉంటారు. హైదరాబాద్ లో ఒక కాలనీలో ఉంటాడు అదే సమయంలో ముగ్గురు అమ్మాయిలు అంజలి(జరీనా), అనన్య(దివ్య), నివేద (పల్లవి) ఒక కేసులో ఇరుక్కుంటారు.


 అందులో నివేదా థామస్ ను జైల్లో పెడతారు. ఎంపీ కొడుకు కేసు కావడంతో ఆమెకు బెయిల్ రాకుండా చేస్తారు. అలాంటి సమయంలో సత్యదేవ్ వాళ్ళకు సాయం చేస్తాడు. అది నచ్చని ఎంపీ అతడిని భయపెట్టాలని చూస్తాడు. దాంతో ఆ కేసును తానే టేకప్ చేస్తాడు సత్యదేవ్. కోర్టులో డిఫెన్స్ లాయర్ నందగోపాల్ (ప్రకాష్ రాజ్) ఎంపీ కొడుకు కేసు వాదిస్తుంటాడు. ఈ కేసులో చివరికి ఏమైంది అనేది అసలు కథ. ఈ సినిమా కథ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పింక్ సబ్జెక్ట్ అందరికీ తెలుసు. తెలుగులో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా వరకు ఒరిజినల్ ని ఫాలో అయిపోయారు. కాకపోతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ విషయంలో మాత్రం కాస్త నిడివి పెంచారు.



దాని కోసం కొన్ని సన్నివేశాలు అల్లుకున్నారు. ఫస్టాఫ్ లొనే శృతి హాసన్ ఎపిసోడ్ పూర్తి చేశారు. సినిమా టేకాఫ్ అవడమే కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు దర్శకుడు వేణు శ్రీరామ్. మొదట్లో పింక్ సినిమా ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించాడు వేణు శ్రీరామ్. మూల కథ మార్చడానికి ఆయన సాహసం చేయలేదు. కాకపోతే ఉన్న కథలో కమర్షియల్ అంశాలు మరిన్ని జోడించి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను ఆయన తీర్చిదిద్దిన విధానం అభిమానులకే కాదు అందరికీ నచ్చుతుంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కథ కూడా తెలిసింది కావడంతో అంత వేగంగా అనిపించదు. పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి అదిరిపోతుంది. సినిమా మొదలైన 15 నిమిషాలకు పవన్ వస్తాడు. తాగుబోతు లాయర్ గా.. అన్యాయం జరిగితే ఎదురుతిరిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కాకపోతే ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మళ్లీ అసలు కథలోకి వచ్చేస్తారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.



మరోవైపు జనసేన పార్టీని కూడా ఈ సినిమాలో బాగానే ప్రమోట్ చేశారు. అది అభిమానులకు బాగానే ఉంటుంది కానీ బయటి వాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు కూడా సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుంది. పవన్ ఒక్కసారి కేసు తీసుకున్న తర్వాత సినిమా స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్లో వాదన ప్రతిపాదనలతో కోర్టు సీక్వెన్స్ దద్దరిల్లిపోయింది. ఆలోచింపచేసే మాటలతో వకీల్ సాబ్ అందర్నీ ఆకట్టుకుంటాడు. అమ్మాయిలకు విలువ ఇవ్వాలి.. వాళ్ళ భావాలను కూడా పట్టించుకోవాలి.. దాడులు జరిగినపుడే హడావిడి చేసేకంటే కూడా అమ్మాయిలకు భద్రత అనేది ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లో వచ్చే పవన్ కళ్యాణ్ డైలాగ్ లు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్న సెకండాఫ్ ఆలోచింప చేశాడు వకీల్ సాబ్



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్...?

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>