PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-happy-you-are-to-invite-the-former-naxalite-into-the-party5469af0a-2f97-48da-bb7a-4c3e2d2c2a11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/how-happy-you-are-to-invite-the-former-naxalite-into-the-party5469af0a-2f97-48da-bb7a-4c3e2d2c2a11-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిధున్ చ‌క్ర‌వ‌ర్తి ఇటీవ‌లే భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేరారు. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్య సీత‌క్క ప్ర‌ధాన‌మంత్రి మోడీతోపాటు బీజేపీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆమెకు నెటిజ‌న్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌టం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివాసీల కోసం శ్రమిస్తూ వారికోసం నిరంత‌రం ఏదో ఓ సాయం చేస్తూనే ఉంటారు. అలాంటి సీతక్క తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారbjp, modi;mithoon;mithun chakraborty;priya;chakravarthy;priyanka;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telugu desam party;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;congress;bollywood;telugu;media;prime minister;assembly;mla;rahul sipligunj;tdp;azmeera chandulal;abhimanyu mithun;party;santoshamమాజీ న‌క్స‌లైట్‌ను పార్టీలోకి ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నారో!!మాజీ న‌క్స‌లైట్‌ను పార్టీలోకి ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నారో!!bjp, modi;mithoon;mithun chakraborty;priya;chakravarthy;priyanka;rahul new;rahul;k l rahul;bharatiya janata party;telugu desam party;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;congress;bollywood;telugu;media;prime minister;assembly;mla;rahul sipligunj;tdp;azmeera chandulal;abhimanyu mithun;party;santoshamThu, 01 Jan 1970 00:00:02 GMT
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిధున్ చ‌క్ర‌వ‌ర్తి ఇటీవ‌లే భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేరారు. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్య సీత‌క్క ప్ర‌ధాన‌మంత్రి మోడీతోపాటు బీజేపీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆమెకు నెటిజ‌న్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌టం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివాసీల కోసం శ్రమిస్తూ వారికోసం నిరంత‌రం ఏదో ఓ సాయం చేస్తూనే ఉంటారు. అలాంటి సీతక్క తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన  సీతక్క మోదీకి షాక్ ఇచ్చేలా ట్వీట్ చేశారు.

నాపై దేశ‌ద్రోహి ముద్ర వేశారు
‘మన ప్రధాని మోడీని చూశారా? మాజీ నక్సలైట్‌ను ఎంత సంతోషంగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారో!.. నేను నక్సలైట్‌ని.. ‌. 20 ఏళ్ల క్రితం నక్సలిజం వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాను. 2004, 2014 ఎన్నికల్లో మీ కూటమితో పొత్తు ఉన్నందువ‌ల్ల‌ అప్పట్లో నేను మీకు మంచి దాన్ని. ఆ తర్వాత నాపై బీజేపీ దేశ ద్రోహిగా ముద్ర వేసింది. దానికి నేను కాంగ్రెస్‌లో ఉండటమే కారణం’ అంటూ సీతక్క ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు గతంలో తనపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశాల్ని కూాడా జత చేశారు. వీటిపై పలువురు నెటిజన్లు స్పందించారు. రిప్లై బాగా ఇచ్చాంటూ సీతక్కపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు సీతక్క ఈ ట్వీట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ట్యాగ్ చేశారు.

టీడీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి..
2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో సీత‌క్క ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓట‌మిపాలైంది. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండో సారి అసెంబ్లీ కి ఎన్నికైంది. బ‌ల‌హీన‌వ‌ర్గాల కోసం నిరంత‌రం ప‌నిచేస్తుండ‌ట‌మే సీత‌క్క‌కు రాజ‌కీయంగా, సామాజికంగా ఒక ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>