PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ys-sharmila-trs-kcr-sharmila-khammam-meeting-7a309bd0-8ce1-4cb4-b286-ce9edf839084-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ys-sharmila-trs-kcr-sharmila-khammam-meeting-7a309bd0-8ce1-4cb4-b286-ce9edf839084-415x250-IndiaHerald.jpgగ‌డిచిన ఏడు సంవ‌త్స‌రాల కాలంలో తెలంగాణ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏం చేయ‌లేక‌పోయింద‌నే విష‌యాన్ని జ‌నంలోకి బాగా తీసుకెళ్ల‌గ‌లిగితేనే పార్టీకి బాగా ఆద‌ర‌ణ ఉంటుంద‌ని న‌మ్ముతున్న వైఎస్ ష‌ర్మిల ఆవిధంగానే వ్యూహాత్మ‌కంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌చేస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ జ‌రుగుతోంది. గ‌త వైఎస్సార్ పాల‌న‌ను, ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తూ ముందుకు సాగ‌డం వ‌ల్లే తెలంగాణ‌ప్రాంత ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించ‌గ‌ల‌మ‌ని ఆమె బ‌లంగా న‌మ్ముతున్నారు. ప్ర‌శ్నించ‌డానికే త‌మ పార్టీ అనే విష‌యాన్ని ఖ‌మ్మం స‌భ‌లsharimila;view;kcr;santoshi;vidya;telangana;y. s. rajasekhara reddy;april;partyష‌ర్మిల అందుకే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోందంట‌..? వ‌్యూహం ఫ‌లిస్తుందా..?ష‌ర్మిల అందుకే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోందంట‌..? వ‌్యూహం ఫ‌లిస్తుందా..?sharimila;view;kcr;santoshi;vidya;telangana;y. s. rajasekhara reddy;april;partyThu, 01 Jan 1970 00:00:02 GMTగ‌డిచిన ఏడు సంవ‌త్స‌రాల కాలంలో తెలంగాణ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏం చేయ‌లేక‌పోయింద‌నే విష‌యాన్ని జ‌నంలోకి బాగా తీసుకెళ్ల‌గ‌లిగితేనే పార్టీకి బాగా ఆద‌ర‌ణ ఉంటుంద‌ని న‌మ్ముతున్న వైఎస్ ష‌ర్మిల ఆవిధంగానే వ్యూహాత్మ‌కంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌చేస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ జ‌రుగుతోంది. గ‌త వైఎస్సార్ పాల‌న‌ను, ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తూ ముందుకు సాగ‌డం వ‌ల్లే తెలంగాణ‌ప్రాంత ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించ‌గ‌ల‌మ‌ని ఆమె బ‌లంగా న‌మ్ముతున్నారు. ప్ర‌శ్నించ‌డానికే త‌మ పార్టీ అనే విష‌యాన్ని ఖ‌మ్మం స‌భ‌లో ష‌ర్మిల చెప్ప‌డాన్ని బ‌ట్టి కూడా ఇది సుస్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.


 కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమని శ్రేణుల‌ను ఉత్తేజ ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారామె. తెలంగాణలో రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని కేసీఆర్ వాగ్బాణాలు సంధించారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్‌ కలలు కన్నారని చెప్పారు. కేసీఆర్‌ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. ప్రైవేట్‌ రంగంలోనూ వైఎస్‌ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? అని మరోసారి ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. మొత్తంగా కేసీఆర్ పాల‌న‌ను, వ్య‌క్తిత్వాన్ని టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.


మ‌రోవైపు తెలంగాణ ప్రజలకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని, వారి అభిమానం, ఆత్మీయత మరువలేనిదని విజయమ్మ వైఎస్సార్‌ను త‌న ప్ర‌సంగంలో గుర్తు చేస్తూ ఆక‌ట్టుకున్నారు. పార్టీ పెడుతున్నట్లు, తెలంగాణ బిడ్డగా, రాజన్న బిడ్డగా మీముందుకు వస్తానన్నప్పుడు ఎంతో సంతోషించానని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలతో రాజశేఖరరెడ్డికి గొప్ప అనుబంధం ఉంది. 18 ఏళ్ల కిందట ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ, న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం’’ అంటూ పేర్కొన‌డం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

వకీల్ సాబ్ ని రాజకీయ శక్తులు ఆపడానికి కారణం తెలుసా..!!

మేమేమీ చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..?

అలాంటివి అస్సలు నచ్చవని చెబుతున్న నిత్యామీనన్..?

వకీల్ సాబ్ : పవన్ తెలంగాణ యాస, అందుకేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>