PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mp-ycp-ap-raghuramakrishnamraju79a37093-da6e-4345-8ce1-0550a5ce61be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mp-ycp-ap-raghuramakrishnamraju79a37093-da6e-4345-8ce1-0550a5ce61be-415x250-IndiaHerald.jpgనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆయ‌న‌కు ఢిల్లీలో భద్రత కల్పించడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. తనకు ఢిల్లీలో కూడా ర‌క్ష‌ణ కల్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రఘురామకృష్ణరాజు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని.. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పించాలని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈ నెల 7న లేఖలు రాశారు. వాటిపై స్పందించిన కేంద్రం ఎంపీకి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది. jagan, mp, ycp, ap, raghuramakrishnamraju;raghu;ramakrishna;andhra pradesh;mp;district;kadapa;court;prime minister;chief minister;cbi;king;minister;cheque;central government;ycp;reddy;party;kanumuru raghu rama krishna rajuజ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??jagan, mp, ycp, ap, raghuramakrishnamraju;raghu;ramakrishna;andhra pradesh;mp;district;kadapa;court;prime minister;chief minister;cbi;king;minister;cheque;central government;ycp;reddy;party;kanumuru raghu rama krishna rajuSat, 10 Apr 2021 08:27:39 GMT
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆయ‌న‌కు ఢిల్లీలో భద్రత కల్పించడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. తనకు ఢిల్లీలో కూడా ర‌క్ష‌ణ కల్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రఘురామకృష్ణరాజు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని.. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పించాలని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈ నెల 7న లేఖలు రాశారు. వాటిపై స్పందించిన కేంద్రం ఎంపీకి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది.

లేఖ‌లో ఏముందంటే..
అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని తాను ఈ నెల 6న సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేశానని ఎంపీ గుర్తు చేశారు. అందుకే తనను హతమారుస్తామని బెదిరిస్తూ ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై ఆందోళన చెందనప్పటికీ.. సీఎం జగన్‌ నేర చరిత్రను బట్టి ఆందోళన కలుగుతోందని, కొన్ని వారాలుగా తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. జైలుకు పంపాలని చూశారని ఆరోపించారు.

న‌న్ను హ‌త్య‌చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు
ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌‌మోహన్ రెడ్డి తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీని కోసం సొంత జిల్లా కడప నుంచి కొందరు ప్రొఫెషనల్‌ కిల్లర్లను పురమాయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న తాజా పరిణామాలతో తనకు భద్రత అవసర‌మ‌ని, హైదరాబాద్‌, ఏపీలో మాత్రమే ‘వై‘ కేటగిరీ భద్రత ఉందని.. ఇకపై ఢిల్లీలో కూడా ఆ స్థాయి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఎంపీ లేఖ‌లో వివ‌రించారు. ఎప్ప‌టినుంచో ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నా స్పందించ‌ని ప్ర‌భుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించింద‌నేదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్ర పెద్ద‌ల అండ‌తోనే ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితోపాటు ఇత‌ర నేత‌ల‌ను చెడుగుడు ఆడుకుంటున్నారే అభిప్రాయం ఆ పార్టీ నేత‌ల్లోనే ఉంది. సొంత పార్టీకి చెందిన ఎంపీనే ఇలా పార్టీ అధ్య‌క్షుడిపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌డం ఏపీలో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. అయితే రోజురోజుకూ రాష్ట్రంలో వైసీపీ బ‌ల‌ప‌డుతుండటాన్ని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం జ‌గ‌న్‌కు చెక్ పెట్ట‌డానికి, బీజేపీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహారాష్ట్రలో లాక్ డౌన్! వ్యతిరేకిస్తున్న వ్యాపారులు

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?

ఎమ్మెల్యేలతో బాబు అత్యవసర భేటీ...?

వకీల్ రచ్చపై పవన్ ఎందుకు స్పందించలేదంటే..?

గ్రామాల మీద జగన్ ఫోకస్... కొత్త నిర్ణయం...?

ఇది పింక్ రీమేక్ కాదు.. పవన్ కళ్యాణ్ సినిమా.. అంతే!

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ జీవో, కోర్టుకు వెళ్ళే యోచనలో థియేటర్ ఓనర్స్ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>