MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab249bfa6b-dcd3-4ef3-b447-5c8568f2e670-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab249bfa6b-dcd3-4ef3-b447-5c8568f2e670-415x250-IndiaHerald.jpgజనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'వకీల్ సాబ్' చిత్రానికి ఏపీలో అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. మాములుగా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో.. ఇవేవీ వకీల్ సాబ్‌కి లేకుండా.. అర్థరాత్రి ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. Vakeel saab;pawan;kalyan;pawan kalyan;andhra pradesh;cinema;high court;cinema theater;government;court;press;good news;hero;cinema tickets;ycp;good newwzవకీల్ సాబ్ కు ఏపి హైకోర్టు గుడ్ న్యూస్..వకీల్ సాబ్ కు ఏపి హైకోర్టు గుడ్ న్యూస్..Vakeel saab;pawan;kalyan;pawan kalyan;andhra pradesh;cinema;high court;cinema theater;government;court;press;good news;hero;cinema tickets;ycp;good newwzSat, 10 Apr 2021 09:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా  'వకీల్ సాబ్' చిత్రానికి ఏపీలో అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. మాములుగా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో.. ఇవేవీ వకీల్ సాబ్‌కి లేకుండా.. అర్థరాత్రి ఏపీలోని అధికారులు కొన్ని జీవోలను విడుదల చేశారు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెట్టి.. అంతకు మించి అమ్మినా, పెంచినా.. థియేటర్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి.


అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా పై చూపిస్తున్నారని అభిమానులు కూడా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ విషయం పై మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు వైసీపీ నాయకులు మైకుల ముందుకు వచ్చి.. హేళనగా మాట్లాడారు. జాయింట్ కలెక్టర్స్ ఆదేశాలిస్తే.. ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం ఏమిటంటూ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చూశారు. కానీ.. అక్కడే దొరికేశారు. ఏం లేనప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ హేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా.. అంటూ మళ్లీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.


ఇకపోతే.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టును సంప్రదించగా.. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏపీలో ప్రతీ పనికి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని.. హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే ఏపీ ప్రభుత్వానికి తెలిసొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి కోర్టు నిర్ణయం చిత్ర యూనిట్ కు కాసుల పంట అనే చెప్పాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొత్త పార్టీ పెట్టడానికి కారణం అదే.. వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..?

వకీల్ సాబ్ సినిమా చూసిన పవన్ అభిమాని పనికి దిల్ రాజు షాక్..!

భారత జలాల్లోకి అమెరికా అడుగు, కొత్త వివాదం...?

అక్క‌డ‌ బాబు.. స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌.. ఏం జ‌రిగిందంటే...!

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?

ఎమ్మెల్యేలతో బాబు అత్యవసర భేటీ...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>