SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smaranadf730f6e-d515-4390-8d14-d57005f111e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smaranadf730f6e-d515-4390-8d14-d57005f111e2-415x250-IndiaHerald.jpgమొరార్జీ దేశాయి (1896 ఫిబ్రవరి 29, – 1995 ఏప్రిల్ 10) భారత స్వాతంత్ర్య సమర యోధుడు,జనతా పార్టీ నాయకుడు. అతను1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాsmarana;kirti;naga chaitanya;mumbai;india;pakistan;gujarat - gandhinagar;morarji desai;government;february;minister;international;march;research and analysis wing;lie;chaitanya 1;party;prasthanamశాంతిని నెల‌కొల్పేందుకు పాటుప‌డిన మొరార్జీ దేశాయి‌శాంతిని నెల‌కొల్పేందుకు పాటుప‌డిన మొరార్జీ దేశాయి‌smarana;kirti;naga chaitanya;mumbai;india;pakistan;gujarat - gandhinagar;morarji desai;government;february;minister;international;march;research and analysis wing;lie;chaitanya 1;party;prasthanamSat, 10 Apr 2021 07:21:39 GMTమొరార్జీ దేశాయి (1896 ఫిబ్రవరి 29, – 1995 ఏప్రిల్ 10) భారత స్వాతంత్ర్య సమర యోధుడు,జనతా పార్టీ నాయకుడు. అతను1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టాడు.


 అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు. మరోవైపు భారతదేశపు నిఘావ్యవస్థ (రా)ను దెబ్బతీసి పాకిస్తాన్‌లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి.


మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు, కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934, 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీలో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి బాధ్యతలను చేపట్టాడు.మొరార్జీ దేశాయ్ జనతాపార్టీకి 1980 సార్వత్రిక ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రచారం చేశాడు, కాని ఎన్నికలో పోటీ చేయలేదు. పదవీ విరమణ తరువాత అతను ముంబైలో నివసించి తన 99వ యేట 1995 ఏప్రిల్ 10 న మరణించాడు. అత్యధిక కాలం జీవించిన భారత ప్రధానిగా గుర్తింపు పొందాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహారాష్ట్రలో లాక్ డౌన్! వ్యతిరేకిస్తున్న వ్యాపారులు

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న కేంద్రం??

ఏడుగురు ఎమ్మెల్యేలతో అర్జెంట్ గా జగన్ సమావేశం...?

ఎమ్మెల్యేలతో బాబు అత్యవసర భేటీ...?

వకీల్ రచ్చపై పవన్ ఎందుకు స్పందించలేదంటే..?

గ్రామాల మీద జగన్ ఫోకస్... కొత్త నిర్ణయం...?

ఇది పింక్ రీమేక్ కాదు.. పవన్ కళ్యాణ్ సినిమా.. అంతే!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>