PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-corona8f2da153-9705-4cae-ba0d-25ea5c8e9245-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-corona8f2da153-9705-4cae-ba0d-25ea5c8e9245-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో కరోనా రెండోద‌శ ఉధృతంగా ఉంది. ముంబ‌యి మ‌హాన‌గ‌రంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మహమ్మారిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహావికాస్‌ అఘాడి కూటమితో పాటు బీజేపీ, ఎంఎన్‌ఎస్‌, ఎస్పీ నాయకులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లాక్‌డౌన్‌ భయంతో సొంత రాషlock down, corona;vijay;bharatiya janata party;maharashtra - mumbai;uddhav thackeray;minister;maharashtra;joseph vijayలాక్‌డౌన్ 2.0లాక్‌డౌన్ 2.0lock down, corona;vijay;bharatiya janata party;maharashtra - mumbai;uddhav thackeray;minister;maharashtra;joseph vijaySat, 10 Apr 2021 16:30:28 GMT
మహారాష్ట్రలో కరోనా రెండోద‌శ ఉధృతంగా ఉంది. ముంబ‌యి మ‌హాన‌గ‌రంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మహమ్మారిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహావికాస్‌ అఘాడి కూటమితో పాటు బీజేపీ, ఎంఎన్‌ఎస్‌, ఎస్పీ నాయకులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లాక్‌డౌన్‌ భయంతో సొంత రాష్ట్రాలకు వ‌ల‌స వెళుతున్నారు.

క‌ఠిన‌మైన లాక్‌డౌన్‌
కరోనా కేసుల పెరుగుదలతో ఇటీవల మ‌హారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. వీటిని మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యతిరేకించారు. ఇవాళ జరిగే సమావేశంలో పరిస్థితిని వివరించి, మద్దతును కూడగట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం వరకు కఠినమైన వారాంతపు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడకుండా సెక్షన్‌ 144 విధించారు. వైరస్‌ను కట్టడించేందుకు రాష్ట్రంలో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌ర‌గ‌నుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

పూర్తి లాక్‌డౌన్‌
వారాంతపు లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పొడగించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్న‌ట్లు  రాష్ట్ర అధికారులు తెలిపారు. శుక్రవారం మహారాష్ట్రల్లో 58,993 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదగా.. 301 మంది మ‌ర‌ణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య 32,88,540కు చేరగా.. మృతుల సంఖ్య 57,329కు పెరిగింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో రోజుకు 55వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. స‌మావేశం అనంత‌రం లాక్‌డౌన్‌పై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందంటున్నారు. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో 60 శాతం మ‌హారాష్ట్ర నుంచే వ‌స్తుండ‌టంపై ప్ర‌ధాన‌మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌జ‌ల్లో నిర్లక్ష్య భావ‌న పెరిగింద‌ని, వారికి అవ‌గాహ‌న పెంపొందించేలా కార్య‌క్ర‌మాలు ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన వకీల్ సాబ్‌

ఓవర్సీస్ లో వకీల్ సాబ్ ఈ వీకెండ్ కి 1 మిలియన్ కొట్టగలదా?

వకీల్ సాబ్ దెబ్బ.. రెండు వారాల వరకు రిలీజ్ అవ్వని సినిమాలు..!!

'వకీల్ సాబ్' సినిమా పై రాజమౌళి, రామ్ చరణ్ స్పందన.. ఏమన్నారంటే..??

వకీల్ సాబ్ : పవన్ ని ఓడించిన ఏపీ నాయకులకు థాంక్స్.. ఫ్లెక్సీ వైరల్ !

కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో మార్పులు... ట్విస్టులు ?

తిరుప‌తిపై ప‌రిష‌త్ ప్ర‌భావం... రీజ‌న్ ఇదే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>