PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vijayasai-reddy4486e6a9-0f9f-4eec-8681-45af70c3136e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vijayasai-reddy4486e6a9-0f9f-4eec-8681-45af70c3136e-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు పంచాయితీ, మున్సిపల్ సమరం జరగగా, తాజాగా పరిషత్ ఎన్నికల పోరు జరిగింది. ఇక ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికల హడావిడిలో రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యలు హైలైట్ అవ్వడం తగ్గినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పటినుంచో అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారు.vijayasai reddy;pawan;view;pawan kalyan;tiru;amaravati;janasena;mp;రాజీనామా;vishakapatnam;tirupati;parliment;husband;central government;ycp;janasena party;party;mantraవిశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ...విజయసాయిరెడ్డిని బుక్ చేస్తున్న జనసేన...విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ...విజయసాయిరెడ్డిని బుక్ చేస్తున్న జనసేన...vijayasai reddy;pawan;view;pawan kalyan;tiru;amaravati;janasena;mp;రాజీనామా;vishakapatnam;tirupati;parliment;husband;central government;ycp;janasena party;party;mantraSat, 10 Apr 2021 03:00:00 GMTఏపీలో ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు పంచాయితీ, మున్సిపల్ సమరం జరగగా, తాజాగా పరిషత్ ఎన్నికల పోరు జరిగింది. ఇక ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికల హడావిడిలో రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యలు హైలైట్ అవ్వడం తగ్గినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పటినుంచో అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారు.


అలాగే నష్టాల్లో ఉందని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, పలు రాజకీయ పార్టీలు, సామాజిక నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అలాగే దీనిపై ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ప్రైవేటీకరణ పాపం మీది అంటే మీది అని తిట్టుకున్నారు. కానీ కలిసికట్టుగా ఈ ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నం చేయలేదు.


ఇక ఎన్నికల హడావిడి మొదలు కావడంతో దీన్ని పక్కనబెట్టేశారు. దీంతో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కాస్త సైడ్‌కు వెళ్ళినట్లు కనిపించింది. పైగా దీనిపై మీడియాలో పెద్దగా చర్చలు కూడా జరగడం లేదు. అయితే తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్‌గా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. విజయసాయిరెడ్డి విశాఖకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపాల్సింది విజయసాయినే అనే విధంగా జనసేన టార్గెట్ చేసింది.


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే...ఎంపీ విజయసాయిరెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో పార్టీలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయాలని, రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగివస్తుందని.. అప్పుడే ప్రైవేటీకరణ ఆగుతుందని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇలా విజయసాయిని టార్గెట్ చేయడం కాస్త విడ్డూరంగానే ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి

వకీల్ సాబ్ లో కనబడే హీరో పవన్ అయితే కనపడని హీరో అతనేనటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>