CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking8ff50820-cb6a-46fa-887d-6673ee5de884-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cooking8ff50820-cb6a-46fa-887d-6673ee5de884-415x250-IndiaHerald.jpgఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం కిచిడి.ఏంటి సగ్గుబియ్యంతో ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా..కానీ దీనిని మీరు ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ బాగుంది అని ఎంతో ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం మన శరీరానికి చాలా చలవ చేస్తుంది. !! శరీరంలో అధిక వేడిమి ఉన్న వాళ్ళు సగ్గుబియ్యం తింటే వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే పిల్లలు కూడా సగ్గుబియ్యాన్ని ఈ విధంగా వెరైటీ రెసిపీ గా చేస్తే ఎంత ఇష్టంindia-herald-cooking;idili;chilli;oil;aqua;ghee;coriander.;pepper powder;ishtamసగ్గుబియ్యం కిచిడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. !!సగ్గుబియ్యం కిచిడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. !!india-herald-cooking;idili;chilli;oil;aqua;ghee;coriander.;pepper powder;ishtamSat, 10 Apr 2021 12:00:00 GMTఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం కిచిడి.ఏంటి సగ్గుబియ్యంతో ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా..కానీ దీనిని మీరు ఒక్కసారి రుచి  చూశారంటే మళ్ళీ మళ్ళీ బాగుంది అని ఎంతో ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం మన శరీరానికి చాలా చలవ చేస్తుంది. శరీరంలో అధిక వేడిమి ఉన్న వాళ్ళు సగ్గుబియ్యం తింటే వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే పిల్లలు కూడా సగ్గుబియ్యాన్ని ఈ విధంగా వెరైటీ రెసిపీ గా చేస్తే ఎంత ఇష్టంగా తినేస్తారు. మరి దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా. ముందుగా దీనికి కావలసిన పదార్ధాలు ఏంటో చూద్దాం.

కావలసిన పదార్థాలు::

సగ్గుబియ్యం- ఒక కప్పు

నెయ్యి -ఒక టేబుల్ స్పూన్

ఆవాలు -అర టీ స్పూన్

పచ్చిమిర్చి -రెండు

కరివేపాకు -ఐదు ఆకులు

బంగాళదుంప -1

ఉప్పు -తగినంత

మిరియాల పొడి -అర టీ స్పూన్

పంచదార -1 స్పూన్

కొత్తిమీర తరుగు -1 స్పూన్

టమాటా -1

వేయించిన వేరుశెనగ గింజలు పొడి- అర కప్పు

ఆయిల్ -సరిపడినంత

తయారీ విధానం:

ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా కడిగి రెండు గంటలు పాటు  నాన బెట్టుకోవాలి.రెండు గంటల తర్వాత వీటిని తీసి ఇంకొక సారి కడిగి  స్టెనర్ సహాయంతో నీళ్లను మొత్తం వడకట్టుకోవాలి.తర్వాత సగ్గుబియ్యాన్ని తీసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద తడి పోయేవరకు ఆరబెట్టుకోవాలి. దాన్ని అలాగే ఉంచి తర్వాత పొయ్యి వెలిగించి ఒక బాండీ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తరువాత దానిలో అర టీస్పూన్ ఆవాలు రెండు పచ్చి మిరపకాయలు,  ఆరు కరివేపాకు ఆకులు వేసి కలుపుకోవాలి.అవి  లైట్ గా వేగిన తర్వాత దానిలో బంగాళదుంప ముక్కలను మరియు టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి.అన్నీ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కొత్తిమీర తరుగు,  అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి .తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఇందాక తయారుచేసుకున్న సగ్గుబియ్యం అందులో వేసి ఒకసారి తిప్పాలి. దానిలో అర కప్పు వేయించిన పల్లీలు పొడి వేసుకొని బాగా కలుపుకుని, చుట్టూ ఒక టీ స్పూన్ నెయ్యి రాసిన గిన్నెలో పొయ్యాలి. తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకుని స్టౌ పై పెట్టి దానిలో అడుగుభాగాన కొంచెం నీళ్ళు పోసి దానిలో ఒక స్టాండ్ పెట్టి, ఆ స్టాండ్ పైన ఇందాక తయారు చేసుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని పెట్టాలి. తర్వాత దానిపై మూతపెట్టాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

తగ్గేదే లే.. ఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన బన్నీ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>