MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab6831fe7d-64c8-48a8-86f7-080d769372e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab6831fe7d-64c8-48a8-86f7-080d769372e8-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ పింక్ మూవీ కి రీమేక్ అయిన వకీల్ సాబ్ చిత్రంతో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలలో నిన్న ఎంతో ఘనంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ రీమేక్ చిత్రం ఒరిజినల్ మూవీ కి ఏమాత్రం తగ్గకుండా, మూవీ సోల్ ని అందంగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు వేణు శ్రీ రామ్.VAKEEL SAB;pawan;prakash raj;shruti;shruti haasan;kalyan;naina;pawan kalyan;raj;ram pothineni;sree raam;sruthi;thaman s;bollywood;cinema;hindi;remake;silver;pink;march;nijam;josh;chitram"వకీల్ సాబ్"... అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు చెంప పెట్టు లాంటిది...?"వకీల్ సాబ్"... అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు చెంప పెట్టు లాంటిది...?VAKEEL SAB;pawan;prakash raj;shruti;shruti haasan;kalyan;naina;pawan kalyan;raj;ram pothineni;sree raam;sruthi;thaman s;bollywood;cinema;hindi;remake;silver;pink;march;nijam;josh;chitramSat, 10 Apr 2021 12:01:06 GMTబాలీవుడ్ పింక్ మూవీ కి రీమేక్ అయిన వకీల్ సాబ్ చిత్రంతో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలలో నిన్న ఎంతో ఘనంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ రీమేక్ చిత్రం ఒరిజినల్ మూవీ కి ఏమాత్రం తగ్గకుండా, మూవీ సోల్ ని అందంగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు వేణు శ్రీ రామ్. హిందీ చిత్రంలోని పాత్రల క్యారక్టరైజేషన్ మన నేటివిటీ కి తగ్గట్టుగా మార్చి తన ప్రతిభను కనబరిచారు దర్శకుడు. పవన్ కం బ్యాక్ స్క్రిప్ట్ అదిరిందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం పవన్ రీ ఎంట్రీ కి ఫుల్ జోష్ అందిస్తుంది అన్న మాటలు..ఇప్పుడు మూవీ చూసాక నిజమే అనిపిస్తుంది.

పింక్ సినిమా చూసిన వారు సైతం  ఈ చిత్రాన్ని ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఫుల్ గా ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా  మెయిన్ కధాంశం ఒకటే అయినా పవన్ కళ్యాణ్ క్యారక్టరైజేషన్, కోర్ట్ లో పవన్ మరియు ప్రకాష్ రాజ్ ల  మధ్య సీన్ లు చాలా కొత్తగానూ.. ఉత్కంఠభరితంగానూ ప్రెజెంట్ చేశారు వేణు శ్రీ రామ్. ఇది నిజంగా పవన్  పవర్ బాక్ మూవీ అని బల్ల గుద్ది చెప్పొచ్చు. కళ్యాణ్ అల్టిమేట్ పెర్ఫార్మన్స్, నటీనటులందరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇంటర్వల్ సీన్ అయితే ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయి. థమన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత హైలెట్ గా నిలిచింది. అయితే కధానాయిక శృతి హాసన్ తో ఫ్లాష్ బ్యాక్ మాత్రం అంత ఆసక్తికరంగా లేదన్నది ప్రేక్షకుల విశ్లేషణ.

అయితే  రాజకీయ నాయకుడిగా మారిన పవన్ మాత్రం అందుకు తగ్గ కథను ఎంచుకొని ఒక వైపు తమ అభిమానులను ఎంటెర్టైన్ చేస్తూనే మరో వైపు సమాజానికి మంచి మెసేజ్ అందించారు. ఈ పాయింట్ పవన్ పాలిటిక్స్ కూడా ప్లస్ అవుతుంది అంటున్నారు ఆయన అభిమానులు. మొత్తానికి గొప్ప కం బ్యాక్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులని 100 పర్శంట్ ఎంటర్టైన్ చేశారు పవన్. ఈ సినిమా పాయింటు మాత్రం సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అద్దం పట్టే విధంగా ఉందని మహిళలు పొగుడుతున్నారు. ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావాలని డిమాండ్ చేస్తున్నారు మహిళామణులు., ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు తెలిసినవే. ఇక నైనా అలాంటి కామాంధులు ఆడవారిని గౌరవిస్తారని అనుకుంటున్నట్లు మహిళలు తెలియచేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ : వెర్రితలలు వేసిన అభిమానం, థియేటర్ లో రక్తంతో ?

తమిళ హీరోలకు దడ పుట్టించిన 'వకీల్ సాబ్ ' రికార్డ్స్..

నాగార్జున దరికి చేరని వకీల్ సాబ్ !

జబర్దస్త్ కు రష్మి గుడ్ బై.. మ్యాటరెంటంటే?

పవన్ మ్యానియాతో పోటీ పడుతున్న తమన్నా కటౌట్ !

వకీల్ సాబ్ తో ఆ నటుడు బౌన్స్ బ్యాక్ అయ్యినట్టేనా..!

తగ్గేదే లే.. ఆ విషయంలో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన బన్నీ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>