PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababub42ebe71-185c-43a3-bb60-1789895df977-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababub42ebe71-185c-43a3-bb60-1789895df977-415x250-IndiaHerald.jpgచంద్రబాబును రాజకీయ చాణక్యుడిగా పోలుస్తు‌న్నారు. వ్యూహ చతురుడిగా చెబుతారు. ఎత్తులు పైఎత్తులు వేయడంలో దిట్టగా పేరున్న నాయకుడు. దేశంలోనే సీనియర్ పొలిటిషియన్ ను అని ఆయనే చెప్పుకుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. కానీ.. ఇప్పుడు ఆయన వ్యూహాల్లో పదును కనిపించడం లేదు. కనీస అంచనాలను కూడా అందుకోలేని విధంగా ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తాజాగా ఆయన పరిషత్ ఎన్నికలపై ఇచ్చిన బహిష్కరణ వ్యూహం కూడా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అసలు చంద్రబాబు బహిష్కరణకు పిలుపు ఇవ్వడమే చారిత్రక తప్పిదం. బహిష్కరణకు ఆయన చెప్పిన chandrababu;view;cbn;tara;chanakya-movie-2019;chanakya;panchayati;industry;ycp;partyపూర్తిగా బెడిసి కొట్టిన చంద్రబాబు బహిష్కరణ వ్యూహం..!?పూర్తిగా బెడిసి కొట్టిన చంద్రబాబు బహిష్కరణ వ్యూహం..!?chandrababu;view;cbn;tara;chanakya-movie-2019;chanakya;panchayati;industry;ycp;partyFri, 09 Apr 2021 07:30:26 GMTచంద్రబాబును రాజకీయ చాణక్యుడిగా పోలుస్తు‌న్నారు. వ్యూహ చతురుడిగా చెబుతారు. ఎత్తులు పైఎత్తులు వేయడంలో దిట్టగా పేరున్న నాయకుడు. దేశంలోనే సీనియర్ పొలిటిషియన్ ను అని ఆయనే చెప్పుకుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. కానీ.. ఇప్పుడు  ఆయన వ్యూహాల్లో పదును కనిపించడం లేదు. కనీస అంచనాలను కూడా అందుకోలేని విధంగా ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తాజాగా ఆయన పరిషత్ ఎన్నికలపై ఇచ్చిన బహిష్కరణ వ్యూహం కూడా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.

అసలు చంద్రబాబు బహిష్కరణకు పిలుపు ఇవ్వడమే చారిత్రక తప్పిదం. బహిష్కరణకు ఆయన చెప్పిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. పైగా తాను ఇచ్చిన మాటను క్యాడర్ రెండో రోజు నుంచే వ్యతిరేకించడం ప్రారంభించింది. దీని ద్వారా పార్టీలో భిన్న స్వరాలు బయటకు వచ్చాయి. ఒక్కో నేత ఒక్కో మాట అన్నారు. ఇంత చేసినా చివరు పార్టీ క్యాడర్ ఎన్నికల్లో పాల్గొన్నారు. వైసీపీ నేతలతో ఘర్షణకు దిగే స్థాయిలో ఎన్నికల్లో పాల్గొన్నారు.

ఇప్పుడు అంతిమంగా చూస్తే చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం ద్వారా ఏం సాధించినట్టు. ఎన్నికలను నుంచి పరారయ్యారన్న అపకీర్తి మూటగట్టుకోవడం మినహా ఆయన సాధించిందేమీ కనిపించడం లేదు. చివరకు పార్టీ క్యాడర్‌ కు కూడా సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఆయన పడిపోయారు. ఇప్పుడు ఏం నిరూపణ అయ్యింది..? చంద్రబాబు ఏం చెప్పినా.. సరే.. క్షేత్రస్థాయిలో ఎన్నికలకు దూరంగా ఉండటం అసాధ్యం అని నాయకులు చెప్పినట్టే కదా.. మరి ఈ మాత్రం ఆలోచన చంద్రబాబుకు లేకుండా పోయిందా అన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. అనవసరంగా చంద్రబాబు బహిష్కరణ పిలుపు ఇచ్చి తప్పు చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

అసలే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఘోర పరాజయంతో డీలా పడిన పార్టీని చంద్రబాబు తన బహిష్కరణ నిర్ణయంతో మరింత డీలా పడేలా చేశారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీకి సై అంటే పరిస్థితి కొంత బావుండేదన్న వాదన వినిపిస్తోంది. మరి అపరచాణక్యుడి వ్యూహాలు ఇంతగా విఫలమవుతున్నాయేమిటో..?





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండు జోన్లలోనే 409 మందికి కరోనా.. హైదరాబాద్ లో కల్లోలం

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !

వ‌కీల్‌సాబ్‌కు తొలి రోజే ఎదురు దెబ్బ...!

వకీల్ సాబ్ : వకీల్ సాబ్ సినిమా చివరకు ఇలా నిలిచింది..!

వ‌కీల్‌సాబ్ హైద‌రాబాద్‌లో రికార్డు షోలు

వకీల్ సాబ్ : యూఎస్ఏ కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!

వకీల్‌సాబ్ సినిమా గురించి ఆలియాభట్ ఏం చెప్పారంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>