PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadish-reddye3dfecb1-742d-4630-96d0-e4074f007716-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadish-reddye3dfecb1-742d-4630-96d0-e4074f007716-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష‌, బీజేపీల మ‌ధ్య తూటాల్లాంటి మాట‌లు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ నేత‌లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థికి క‌నీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాంగ్రెస్ నjagadish reddy;nagarjuna akkineni;bharatiya janata party;telangana;congress;mandalam;car;minister;janareddy;kusuma jagadish;reddy;mantraబీజేపీ నేత‌లు వీధిరౌడీలు.... మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..బీజేపీ నేత‌లు వీధిరౌడీలు.... మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..jagadish reddy;nagarjuna akkineni;bharatiya janata party;telangana;congress;mandalam;car;minister;janareddy;kusuma jagadish;reddy;mantraFri, 09 Apr 2021 13:47:03 GMTనాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష‌, బీజేపీల మ‌ధ్య తూటాల్లాంటి మాట‌లు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ నేత‌లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థికి క‌నీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జానారెడ్డి పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.


ఓటర్లను ఆకర్షించే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమైపోయారు ప్రధాన పార్టీల నేతలు. దీంతో సాగర్‌ నియోజకవర్గంలోని పల్లెలన్నీ ప్రచారంలో తడిసిముద్దవుతున్నాయి. డప్పు చప్పుళ్లు, మైక్ సౌండ్లతో మార్మోగిపోతున్నాయి. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఊళ్లను చుట్టేస్తున్నాయి. ముఖ్య నేత‌లు కుల స‌మీక‌ర‌ణ‌ల్లో మునిగిపోయారు. కులాల వారీగా ఎట్రాక్ట్ చేసేందుకు హామీలు ఇస్తున్నాయి. ఇక అధికార పార్టీకి చెందిన‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ఎక్కడికక్కడ మకాం వేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కారు గుర్తుకే ఓటేయాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోని జానారెడ్డి.. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు మంత్రి తలసాని.


అటు గుర్రంపాడులో ప్రచారం చేసిన నోముల భగత్‌.. సంక్షేమ పథకాలు చూసి కారుకి ఓటేయాలని విఙ్ఞప్తి చేశారు.సాగర్‌ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్‌, బీజేపీ పట్టుమీద ఉన్నాయి. జనసేనానిని కూల్‌ చేసి సాగర్‌లో ప్రచారం చేయించుకోవడం ద్వారా లబ్ధి పొందాలని తెలంగాణ బీజేపీ నేతలు పావులు కదువుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాగర సమరంలో సై అంటే సై అంటోంది కాంగ్రెస్‌. బస్తీమే సవాల్‌ అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లకుండా పోలింగ్‌కి వెళ్లి ఎవరు గెలుస్తారో వారిదే నిజమైన గెలుపు అంటున్నారు జానారెడ్డి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ క్రేజ్ మామూలుగా లే...'తగ్గేదే లే' టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత !

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

వకీల్ సాబ్ సినిమా స్ట్రామ్ హంగామా షురూ..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>