MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab46aa3373-68cd-4f70-8e1d-0e9b3a9c7d12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab46aa3373-68cd-4f70-8e1d-0e9b3a9c7d12-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా కు కట్ చెప్పి రాజకీయ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే..దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ సైన్ చేసిన మొదటి చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ ఒరిజినల్ మూవీ పింక్ కి రీమేక్ ఇది. అక్కడ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ కథ లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు శ్రీరామ్ వేణు. VAKEEL SAB;pawan;ananya pandey;shruti;shruti haasan;ananya;anjali;geetha;jeevitha rajaseskhar;kalyan;niveda thomas;pawan kalyan;satya;satya dev;sriram;sruthi;thaman s;varsha;bollywood;cinema;sangeetha;remake;posters;pink;dil;ananya nagalla;coronavirus;chitramవకీల్ సాబ్ గర్జన ముందు కరోనా వైరస్ సైతం పరార్...?వకీల్ సాబ్ గర్జన ముందు కరోనా వైరస్ సైతం పరార్...?VAKEEL SAB;pawan;ananya pandey;shruti;shruti haasan;ananya;anjali;geetha;jeevitha rajaseskhar;kalyan;niveda thomas;pawan kalyan;satya;satya dev;sriram;sruthi;thaman s;varsha;bollywood;cinema;sangeetha;remake;posters;pink;dil;ananya nagalla;coronavirus;chitramFri, 09 Apr 2021 18:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా కు కట్ చెప్పి రాజకీయ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే..దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్ సైన్ చేసిన మొదటి చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ ఒరిజినల్ మూవీ పింక్  కి రీమేక్ ఇది. అక్కడ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ కథ  లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు శ్రీరామ్ వేణు. వకీల్ సాబ్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించారు. అన్యాయాన్ని ఎదిరించి ఎదురు నిలబడ్డ వ్యక్తిగా పవన్ అదరగొట్టారు. దిల్ రాజు ,బోణి కపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఇందులో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించారు. కీలకమైన ముగ్గురు అమ్మాయిల పాత్రల్లో అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ ఈ చిత్రంలో నటించారు. వీరి నటన చిత్రానికి కీ పాయింట్ అని అంటున్నారు. టీజర్, సాంగ్స్, పోస్టర్ ఇలా అన్ని ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. దీనితో ఈ చిత్రం పై అంచనాలు అంతకంతకు పెరిగాయి. 

అందరి ఆనందాల మధ్య నేడు ఘనంగా విడుదల అయిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల ఆదరణ పొందింది..ఎలాంటి స్పందన తెచ్చుకుంది అంటే.. మహిళల సమస్యల కు ఓ లాయర్ ఎలా అండగా నిలబడి పోరాడారు అన్న కధనంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల  ప్రేక్షకులను మెప్పించగలిగేలా ఉందని చెబుతున్నారు. ఇక కథ విషయానికొస్తే ముగ్గురు మహిళలు స్వేచ్ఛగా ఉంటూ వారికి నచ్చినట్టు జీవిస్తుంటారు. అయితే అనుకోకుండా ఒక్క రాత్రి జరిగిన పరిణామాల వల్ల వారి జీవితం చిక్కుల్లో పడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు బాధితులైన వాళ్లనే ...నిందింతులుగా చూపెడతాయి. సాక్ష్యాలు సైతం వారికి వ్యతిరేకంగా ఉండడంతో అందరికి వాళ్ళే నేరస్థులుగా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడతాడు లాయర్ సత్య దేవ్(పవన్ కళ్యాణ్).

అవతలి వారికి అన్ని రకాల సపోర్ట్ ఉన్నప్పటికీ వారిని ఎలా లాయర్ సత్య దేవ్ నేరస్థులుగా నిరూపించి నిజాన్ని అందరి ముందుకు తీసుకొచ్చారన్నది కథ. సందేశాత్మక విలువలతో రూపు దిద్దుకున్న ఈ సినిమాని దర్శకుడు వేణు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడన్న ప్రశంసలు వినపడుతున్నాయి. సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రతి క్షణం ఎంతో ఆసక్తి కరంగానూ ఉత్కంఠ భరితంగానూ ఉన్నట్లు ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి వసూళ్ళ వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుండి ఈ చిత్ర నిర్మాతలు దిల్ రాజు మరియు బోణీ కపూర్ బయపడినట్లుగా కరోనా వైరస్ సైతం ఈ చిత్రాన్ని ఎంతమాత్రం అడ్డుకోలేదని చెబుతున్నారు ప్రముఖ సినీ క్రిటిక్స్. ఇదే విధంగా వకీల్ సాబ్ నిలకడగా వసూళ్లను సాధిస్తూ పోతే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ పవన్ వశమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పలువురు హీరోలు సైతం ఈ సినిమా టాక్ పట్ల భయపడుతూ ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేనున్నానంటూ... మ‌హారాష్ట్ర‌ను ఆదుకున్న తెలంగాణ‌

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>