MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-sab-moviea95b4435-c7ba-469a-bc94-6bba25a9ea5d-415x250-IndiaHerald.jpgజనసేనాని పవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, తాజాగా నటించిన చిత్రం వకీల్ సాబ్.. హిందీలో సక్సెస్ అయిన పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పవన్ సినిమాలు అంటే యువతలో ఎంత ఎనర్జీని తీసుకువస్తాయో చెప్పనక్కర్లేదు.. సినిమా పూజాకార్యక్రమాలు మొదలైనప్పటి నుంచీ థియేటర్లలోకి వచ్చే వరకు సందడి చేస్తారు. అయితే ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా పై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ Vakeel sab movie;pawan;kalyan;krishna river;vijayawada;andhra pradesh;district;cinema;remake;krishna district;success;pinkవకీల్ సాబ్ సినిమా పై ఏపి సర్కార్ కక్ష.. అందుకే అలా.. !వకీల్ సాబ్ సినిమా పై ఏపి సర్కార్ కక్ష.. అందుకే అలా.. !Vakeel sab movie;pawan;kalyan;krishna river;vijayawada;andhra pradesh;district;cinema;remake;krishna district;success;pinkFri, 09 Apr 2021 09:00:00 GMTపవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, తాజాగా నటించిన చిత్రం వకీల్ సాబ్.. హిందీలో సక్సెస్ అయిన పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పవన్ సినిమాలు అంటే యువతలో ఎంత ఎనర్జీని తీసుకువస్తాయో చెప్పనక్కర్లేదు.. సినిమా పూజాకార్యక్రమాలు మొదలైనప్పటి నుంచీ థియేటర్లలోకి వచ్చే వరకు సందడి చేస్తారు. అయితే ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా పై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది.


కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్‌ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. ,అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్‌ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్‌ షోల టికెట్లను  కొన్ని థియేటర్లలో కొనుగోలు చేశారు. అయితే నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా జేసీ ఈ సినిమా ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వలేదని, టికెట్ల ధరల పెంపు లేదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


దీనిపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ థియేటర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల విడుదలైన నితిన్‌ చిత్రం 'రంగ్‌ దే'కు టికెట్‌ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్‌ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని నిలదీశారు. ఇంకోవైపు.. జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటనతో ఎగ్జిబిటర్లు కూడా డైలమాలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు గిట్టుబాటు ఉండదని నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారు. గాంధీనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన గలాటా నేపథ్యంలో థియేటర్ల వద్ద పరిస్థితులు ఏ క్షణాన ఎలా మారతాయోనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.. థియేటర్ల దగ్గర బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వినిపిస్తుంది.  కలెక్షన్ల పరిస్థితి ఎంటో సాయంత్రం చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ ఇస్తానని వచ్చి.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా..?

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్.. టైం వచ్చినప్పుడు చెబుతాం !

వ‌కీల్‌సాబ్‌: ఏపీలో ఫ్యాన్స్ ర‌చ్చ‌... విరిగిన కుర్చీలు.. థియేట‌ర్లు ధ్వంసం

వ‌కీల్‌సాబ్‌కు షాక్ ఇచ్చిన ఏపీ స‌ర్కార్‌

వ‌కీల్‌సాబ్‌: హైద‌రాబాద్‌లో హంగామా ఈ రేంజ్‌లోనా ?

వ‌కీల్‌సాబ్‌: థియేట‌ర్ల ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌డిగాపులు

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>