PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan339e6355-ca8b-472c-99a0-9235e8ea4db9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan339e6355-ca8b-472c-99a0-9235e8ea4db9-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్నటి వరకూ చోటా మోటా నేతలు ప్రచారంలో ఉన్నారు.. ఇక ఇప్పుడు అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్ ప్రచారం ప్రారంభించేశారు. ఈనెల 14న సీఎం జగన్ రంగంలోకి దిగబోతున్నారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారానికి రాలేదు. మొదటిసారి తిరుపతి రాబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయం కోసం వైఎస్ ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకున్నారనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు ఆయన రాసిన లేఖ చూస్తే అదే నిజమనిపిjagan;view;amala akkineni;tiru;ysr congress party;jagan;nara lokesh;tirupati;chief minister;loksabha;parliment;husband;letter;tdp;ycp;partyతిరుపతి ఉపఎన్నికలో జగన్ నమ్ముకున్నది ఆ ఒక్కటేనా..?తిరుపతి ఉపఎన్నికలో జగన్ నమ్ముకున్నది ఆ ఒక్కటేనా..?jagan;view;amala akkineni;tiru;ysr congress party;jagan;nara lokesh;tirupati;chief minister;loksabha;parliment;husband;letter;tdp;ycp;partyFri, 09 Apr 2021 07:11:28 GMTతిరుపతి ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్నటి వరకూ చోటా మోటా నేతలు ప్రచారంలో ఉన్నారు.. ఇక ఇప్పుడు అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్ ప్రచారం ప్రారంభించేశారు. ఈనెల 14న సీఎం జగన్ రంగంలోకి దిగబోతున్నారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారానికి రాలేదు. మొదటిసారి తిరుపతి రాబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయం కోసం వైఎస్ ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకున్నారనిపిస్తోంది.


తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు  ఆయన రాసిన లేఖ చూస్తే అదే నిజమనిపిస్తోంది.  22 నెలల పరిపాలనా కాలంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును గురించే జగన్ ప్రధానంగా చెప్పుకుంటున్నారు.. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని జగన్ బాగా నమ్ముకున్నారు.


ఇవే కాకుండా గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నమ్ముకున్నారు. 22 నెలల పరిపాలనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని  ప్రచారం చేసుకుంటున్నారు.


అందుకే తాను స్వయంగా ప్రచారానికి వస్తున్నా.. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే  సీఎం వైయస్‌ జగన్‌ రాసిన ఉత్తరాలను తిరుపతి పార్లమెంట్ పరిధిలో బాగా ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించింది. తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైయస్‌ఆర్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలంటూ జగన్ రాసిన లేఖలను వైసీపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజలకు అందిస్తారట.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండు జోన్లలోనే 409 మందికి కరోనా.. హైదరాబాద్ లో కల్లోలం

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !

వ‌కీల్‌సాబ్‌కు తొలి రోజే ఎదురు దెబ్బ...!

వకీల్ సాబ్ : వకీల్ సాబ్ సినిమా చివరకు ఇలా నిలిచింది..!

వ‌కీల్‌సాబ్ హైద‌రాబాద్‌లో రికార్డు షోలు

వకీల్ సాబ్ : యూఎస్ఏ కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!

వకీల్‌సాబ్ సినిమా గురించి ఆలియాభట్ ఏం చెప్పారంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>