PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafbb58156-053d-40aa-84e8-f9c410909aec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafbb58156-053d-40aa-84e8-f9c410909aec-415x250-IndiaHerald.jpgఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి ర్యాలీగా వెళ్తున్న‌ వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొన‌డంతో కొంత‌మందికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం 5గంటలకు సభ జరగనుంది. ఇందుకోసం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సంకల్ప సభలో షర్మిలతోపాటు వైఎస్‌ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మsharmila;anil music;suma;suma kanakala;tara;vijayalakshmi;hyderabad;telangana;district;husband;central government;khammam;partyష‌ర్మిల కాన్వాయ్‌లో ప్ర‌మాదం.... ఏం జ‌రిగిందంటే..?!ష‌ర్మిల కాన్వాయ్‌లో ప్ర‌మాదం.... ఏం జ‌రిగిందంటే..?!sharmila;anil music;suma;suma kanakala;tara;vijayalakshmi;hyderabad;telangana;district;husband;central government;khammam;partyFri, 09 Apr 2021 14:31:28 GMTఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి ర్యాలీగా వెళ్తున్న‌ వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొన‌డంతో కొంత‌మందికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం 5గంటలకు సభ జరగనుంది. ఇందుకోసం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సంకల్ప సభలో షర్మిలతోపాటు వైఎస్‌ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మిల స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు.


సాయంత్రం జరగనున్న సభలో కొత్త పార్టీ పేరుతో పాటు జెండాను షర్మిల ఆవిష్కరించే అవకాశముంది. ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తున్నారు. సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అంత‌కుముందు  పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు. ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలుకుతారు. ఖమ్మంలో భారీ ర్యాలీ ద్వారా బహిరంగ సభకు చేరుకుంటారు.  


ఈ స‌భ‌ను విజ‌యవంతం చేసేందుకు వైఎస్ ష‌ర్మిల పార్టీ శ్రేణులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై రెండు రోజుల‌క్రిత‌మే తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సభలో పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ కార్యాచరణను వైఎస్‌ షర్మిల ప్రకటిస్తారని పార్టీ నేత కొండారెడ్డి ఇప్ప‌టికే మీడియాకు స్ప‌ష్టం చేశారు.  కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేందుకే వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారన్నారు రాఘవరెడ్డి. సంకల్పసభను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>