Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-202176cc0ba7-49f2-4770-bfe4-0a9fd0a2a7c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-202176cc0ba7-49f2-4770-bfe4-0a9fd0a2a7c0-415x250-IndiaHerald.jpgదేశాన్నిఒకపక్క కరోనా అల్లకల్లోలం చేస్తుంది. దేశంలో రోజురోజుకూ ప్రబలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు బీసీసీఐ సిద్ధం అయింది. ఐపీఎల్ 13వ సీజన్‌ ముగిసిన కొద్ది సమయంలోనే మళ్లీ సంబరాలు సృష్టించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. మరికొద్ది సమయంలో తొలి మ్యాచ్ కూడా..ipl 2021;rani;rohit;mumbai;virat kohli;cricket;bcci;bengaluru 1;chennai;christian;army;winner;letter;international;sardar vallabhai patel;misterఐపీఎల్ 2021: బోణీ కొట్టేదెవరో..?ఐపీఎల్ 2021: బోణీ కొట్టేదెవరో..?ipl 2021;rani;rohit;mumbai;virat kohli;cricket;bcci;bengaluru 1;chennai;christian;army;winner;letter;international;sardar vallabhai patel;misterFri, 09 Apr 2021 18:41:17 GMTఇంటర్నెట డెస్క్: దేశాన్నిఒకపక్క కరోనా అల్లకల్లోలం చేస్తుంది. దేశంలో రోజురోజుకూ ప్రబలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు బీసీసీఐ సిద్ధం అయింది. ఐపీఎల్ 13వ సీజన్‌ ముగిసిన కొద్ది సమయంలోనే మళ్లీ సంబరాలు సృష్టించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. మరికొద్ది సమయంలో తొలి మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనుండడంతో ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. అయితే వారు ఎదురుచూస్తున్న తొలి మ్యాచ్, అది కూడా టీమిండియా కెప్టెన్.. విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య జరగనుండడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ముంబై, ఇటు బెంగళూరు రెండు జట్లు కూడా భారీ హిట్టర్లతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల అద్భుత ప్రదర్శన చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇప్పటికే మొత్తంగా 5 టైటిళ్లు, వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన రోహిత్ సేన.. హ్యాట్సిక్‌పై కన్నేసింది. అంతర్జాతీయ స్థాయి బెస్ట్ ఆటగాళ్ళతో బలమైన జట్టుగా రోహిత్‌ సేన కనిపిస్తోంది. రోహిత్‌, డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌, పొలార్డ్‌ లాంటి బారీ హిట్టర్‌లతో ముంబై బలంగా ఉంది. ముంబై కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌తోనూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ముంబై బౌలింగ్‌ దళంలో బుమ్రా, బౌల్ట్‌లాంటి ప్రమాదకర బౌలర్లున్నారు.

కోహ్లీ సేన కూడా ముంబైకి బలమైన పోటీ ఇచ్చేలా ఉంది. ఆర్‌సీబీ జట్టులో కూడా భారీ హిట్టర్లున్నారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రధానంగా రూ.14.25 కోట్లు పోసి కొనుగోలు చేసిన మ్యాక్స్‌వెల్‌పైనే ప్రస్తుతం ఆర్సీబీ ఆశలన్నీ నెలకొన్నాయి. ఇక అటు బౌలింగ్‌లోనూ ఈ సారి పటిష్ఠంగా కనిపిస్తోంది. కైల్ జేమిసన్, డానియల్ క్రిస్టియన్ వంటి బౌలర్లు బెంగళూరుకు బలంగా మారనున్నారు. 

కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీ, దేవ్‌దత్ పాడికల్‌ ఓపెనింగ్ చేయవచ్చు. కరోనా కారణంగా తుది జట్టులో దేవదత్ స్థానంపై అనేక సందేహాలు ఉన్నప్పటికి ఎట్టికేలకు అతనికి చోటు లభించింది. గ్లెన్ మాక్స్‌వెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు. నాలుగో స్థానంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. అలాగే ఆల్ రౌండర్లుగా డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, కైల్ జేమిసన్‌లలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇక ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇరు జట్లు కూడా పటిష్ఠంగా ఉండడంతో విజేత ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేనున్నానంటూ... మ‌హారాష్ట్ర‌ను ఆదుకున్న తెలంగాణ‌

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>