Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaakel-saab6ef436f7-0f02-4dcc-90ef-c6972023cc50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaakel-saab6ef436f7-0f02-4dcc-90ef-c6972023cc50-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ గా ఇక తమ అభిమాన నటుడినీ వెండితెరపై చూడాలి అనుకున్న అభిమానుల కోరిక తీరింది. పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాకVaakel saab;pawan;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;blockbuster hit;remake;pink;venu sreeram;fidaaవ‌కీల్‌సాబ్‌: పింక్‌ను మించిపోయిందిగా...!వ‌కీల్‌సాబ్‌: పింక్‌ను మించిపోయిందిగా...!Vaakel saab;pawan;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;blockbuster hit;remake;pink;venu sreeram;fidaaFri, 09 Apr 2021 10:00:00 GMTపవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.  ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ గా ఇక తమ అభిమాన నటుడినీ వెండితెరపై చూడాలి అనుకున్న అభిమానుల కోరిక తీరింది. పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.  ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా..  మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.



 ఈ సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ గా ఎదురు చూస్తున్న అభిమానులందరి ఆకలి తీర్చేలా ఉంది ఈ సినిమా.  ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ నటనకు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఫిదా కావాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ గా తెరకెక్కినప్పటికీ అటు దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం ఈ సినిమా స్టోరీ లో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులూ చేశాడు.



 సినిమా పరిశ్రమలో రీమేక్ సినిమాలు కామన్.. కానీ కొన్ని సినిమాలు మాత్రం అసలు సినిమా కంటే అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చూసిన కూడా అదే అనిపిస్తుంది అని చెబుతున్నారు ప్రేక్షకులు.  రీమేక్ గా తెరకెక్కినప్పటికీ ఏకంగా పింక్ సినిమాను మించిపోయింది అని చెబుతున్నారు.  ఇక కొన్ని మార్పులు చేర్పులు చేసి దర్శకుడు వఖిల్ సాబ్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని..  అభిమానులు పవన్ కళ్యాణ్ ను రీ ఎంట్రీ సినిమాలో ఎలా చూడాలి అనుకున్నారో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాలో పవర్ స్టార్ ను అలా చూపించాడు అంటూ ప్రస్తుతం సినిమా చూసిన అందరూ చెబుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ తో స్టాలిన్ భేటీ అవుతారా...?

వకీల్ సాబ్ : ఏపీ సర్కార్ మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్.. టైం వచ్చినప్పుడు చెబుతాం !

వ‌కీల్‌సాబ్‌: ఏపీలో ఫ్యాన్స్ ర‌చ్చ‌... విరిగిన కుర్చీలు.. థియేట‌ర్లు ధ్వంసం

వ‌కీల్‌సాబ్‌కు షాక్ ఇచ్చిన ఏపీ స‌ర్కార్‌

వ‌కీల్‌సాబ్‌: హైద‌రాబాద్‌లో హంగామా ఈ రేంజ్‌లోనా ?

వ‌కీల్‌సాబ్‌: థియేట‌ర్ల ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌డిగాపులు

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>