EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgక్యాడ‌ర్ ఉన్నా..న‌డిపించే నాయ‌క‌త్వం లేక రాష్ట్రంలో కాంగ్రెస్ నానాటికి తీసిక‌ట్టుగా మారుతోంది. పోరాట ఉద్య‌మాలు చేయ‌డం చాత‌కాదు గాని.... మైకులు క‌నిపిస్తే చాలు ఉప‌న్యాసాల‌తో ఊగిపోతుంటారు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా బలమైన ప్రతిపక్షపార్టీ ఉంటేనే అన్నీ సజావుగా న‌డుస్తుంటాయి. అయితే రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌న‌బ‌డ‌టం లేదు. వరుస వైఫల్యాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు నాయకత్వ కొరత, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్congress;soniagandhi;kumaar;manu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;mohandas karamchand gandhi;sonia gandhi;congress;రాజీనామా;tpcc;reddy;josh;partyహెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఐక్య‌తేదీ..? పోరాట‌మేదీ..? విజ‌యాల క‌ల అత్యాశ కాదా?హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఐక్య‌తేదీ..? పోరాట‌మేదీ..? విజ‌యాల క‌ల అత్యాశ కాదా?congress;soniagandhi;kumaar;manu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;mohandas karamchand gandhi;sonia gandhi;congress;రాజీనామా;tpcc;reddy;josh;partyFri, 09 Apr 2021 12:40:57 GMTక్యాడ‌ర్ ఉన్నా..న‌డిపించే నాయ‌క‌త్వం లేక రాష్ట్రంలో కాంగ్రెస్ నానాటికి తీసిక‌ట్టుగా మారుతోంది. పోరాట ఉద్య‌మాలు చేయ‌డం చాత‌కాదు గాని.... మైకులు క‌నిపిస్తే చాలు ఉప‌న్యాసాల‌తో ఊగిపోతుంటారు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా బలమైన ప్రతిపక్షపార్టీ ఉంటేనే అన్నీ సజావుగా న‌డుస్తుంటాయి. అయితే రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌న‌బ‌డ‌టం లేదు. వరుస వైఫల్యాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు నాయకత్వ కొరత, మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీ.. వ‌రుస‌గా నేత‌లు కూడా వెళ్లిపోతుండ‌టంతో రోజు రోజుకూ మరింత బలహీనపడుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం.. మ‌రోక‌రిని ఆస్థానంలో నియ‌మించ‌డంలో అధిష్ఠానం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మరోవైపు రోజుకో నేత కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.


తెలంగాణలో బీజేపీ బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం ఏకకాలంలో జరుగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో దూకుడు పెంచిన బీజేపీ, గ్రేటర్ ఫలితాలతో మరింత జోష్ నింపుకుంది. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించుకుంది. అన్నట్లుగానే టీఆర్ఎస్ తో తలపడుతోంది. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికిని కూడా చాటులేకపోతోంది. ఎన్నికల్లో కాదు… ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


జాతీయ స్థాయిలోనూ నాయ‌క‌త్వం విష‌యంలో అనిశ్చితే కొన‌సాగుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, లేదా గాంధీ,నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కొత్త నీరు రాకతో పాత నీరు వదిలిపోతుంది. ఇక్కడ గాంధీ, నెహ్రూ కుటుంబం లేకుండా అసలు కాంగ్రెస్‌ మనుగడే కష్టంగా పరిణమించింది. కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పుల కోసం కష్టపడుతూ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీ సమావేశాలు జరిపి నాయకులను ఎంచుకోవడం, రాష్ట్రాల అధ్యక్షుల నియామకం చేయడంలో తత్సారం చేస్తూ నమ్ముకున్న నాయకులను కూడా ఆయారాష్ట్రాలలోను, ప్రాంతీ యంగా కోల్పోతుంది. కిందిస్థాయిలో కాంగ్రెస్‌ను నమ్ముకొని పని చేస్తున్న కేడర్‌కు కానీ,కార్యకర్తలకు కానీ మేమున్నాం అని భరోసా నిచ్చే నాయకులు క‌రువ‌య్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్క‌డిక‌క్క‌డే ఏడుగురిని కాల్చిపారేశారు

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..

వకీల్ సాబ్ నిలుపుదలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇదే..

తెలుగు సినిమాకు వన్ అండ్ ఓన్లీ పవన్

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

వకీల్ సాబ్ సినిమా స్ట్రామ్ హంగామా షురూ..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>