Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/health-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/health-IndiaHerald.jpg క్యాన్సర్... ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలామందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్cancer;surya sivakumar;tumor;cancer;lung cancer;vక్యాన్సర్ లక్షణాలు ఎలా గుర్తించవచ్చు...?క్యాన్సర్ లక్షణాలు ఎలా గుర్తించవచ్చు...?cancer;surya sivakumar;tumor;cancer;lung cancer;vFri, 09 Apr 2021 06:00:00 GMT
 క్యాన్సర్... ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలామందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోంది. కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుంది. క్యాన్సర్ అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది? ఏయే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి తదితర అంశాలను తెలుసుకుందాం.



కాన్సర్ సమూహాలనే కనితి అంటారు. దీనిని ఇంగ్లీషు లో ట్యూమర్ అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని మనం కాన్సర్ అని అంటాము. అయితే ఈ రకమైన పెరుగుదలకు ఒక క్రమం ఉండదు. దీనికి ఎటువంటి స్పష్టమైన విధి ఉండదు. ప్రపంచం లోనే క్యాన్సర్ అతి ఖరీదైన వ్యాధి అని చెప్పొచ్చు. ఏటా అనేక మంది ఈ వ్యాధి తో బాధ పడుతూ ఉన్నారు. చాలా మంది కి చికిత్స పొందుతున్నకూడా నయం అవ్వడం లేదు. అయితే ముఖ్యంగా ముందుగా దీన్ని గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుందని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పింది. అయితే ఈ రోజు మనకి నిపుణులు క్యాన్సర్ గురించి అనేక విషయాలు చెప్పారు.


 అయితే కేన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వివిధ రకాల క్యాన్సర్లు వ్యాపిస్తూ ఉంటాయి. అయితే వాటిలో ఉండే రకాల గురించి క్లుప్తంగా ఇప్పుడు చూసేద్దాం.. కార్సినోమా అనేది ఉప కణ కణ జాలాల లో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. అయితే ఇవి ఎలా వ్యాపిస్తాయి ఎక్కడ వ్యాపిస్తాయి అనే విషయానికి వస్తే.. ఈ కణాలలో క్యాన్సర్ చర్మం, శ్వాస, జీర్ణ, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదు అంటే ఈ క్యాన్సర్ దేహం లోని వివిధ గ్రంధులు కి కూడా ఏర్పడే అవకాశం ఉంది. జీర్ణ గ్రంధులు, నాడీ కణజాలం నుంచి కూడా ఈ కార్సినోమా క్యాన్సర్ వస్తుంది. అయితే మన దేహం లో ఏర్పడిన క్యాన్సర్ల లో 85% ఈ రకానికి చెందినవి అని చెప్పొచ్చు. ఇదే కార్సినోమా క్యాన్సర్ అంటే. లింఫోమా కాన్సర్ అంటే ఏమిటి అంటే ప్లీహం శోషరస గ్రంధులు లో తెల్ల రక్త కణాల లో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. వీటినే లింఫోమా కాన్సర్ అని అంటాము. శరీరం లో ఏర్పడే ట్యూమర్లు ఇవి. ఇంచుమించు నాలుగు శాతం మాత్రమే ఉంటాయి. ఇదే లింఫోమా కాన్సర్ అంటే.



 లుకేమియా కాన్సర్ అంటే రక్తం లో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. అయితే ఇది ముఖ్యంగా బోన్ మారో ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. దీనిని ద్రవ రూప కాంతి అని కూడా అంటారు. అయితే లుకేమియా అనే పదానికి అర్థం ఏమిటంటే లూకాస్ అంటే తెలుపు, అమియా అంటే రక్తానికి సంబంధించినది అందుకే దీన్ని లుకీమియా అని అంటారు.ఇక సార్కోమా కాన్సర్ అంటే ఏమిటంటే సంయోజక కణ జాలాల లో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు ఇవి మధ్య నుంచి ఏర్పడిన కణ జాలాలు అయితే ఇవి ఎలా ఏర్పడతాయి అనే విషయానికి వస్తే... అవయవాల నుంచి గాని ఈ క్యాన్సరు ఏర్పడే అవకాశం ఉంది. కాన్సర్ల లో సార్కోమా కాన్సర్ రెండు శాతం ఉంటాయి.


 ఇప్పుడు క్యాన్సర్లో రకాలు చూశారు కదా..! ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ మరియు ట్రీట్మెంట్ కి సంబంధించిన విషయాలు కూడా చూసేద్దాం. అయితే క్యాన్సర్ లో మార్పులు వస్తూనే ఉంటాయి ఇది సెల్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చు. జెనిటిక్ సెల్స్ కూడా మ్యూటేషన్స్ అవుతాయి అలాగే ఇవి పుట్టిన తర్వాత పరిస్థితులు కారణంగా కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. కాన్సర్ కి కారణం అయ్యే కెమికల్స్ వల్ల కూడా ఇది ఏర్పడతాయి.రేడియేషన్ కి గురి అయినప్పుడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
సూర్య కిరణాల ద్వారా కూడా ఇది ఏర్పడే అవకాశం ఉంది.కొన్ని రకాల వైరస్ వల్ల కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హెచ్పీవీ వైరస్ కారణంగా కూడా క్యాన్సర్ రావచ్చు.ధూమపానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది.లైఫ్ స్టైల్ అలానే ఫిజికల్ యాక్టివిటీ, ఆహార పదార్థాలు వీటి కారణంగా కూడా క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>