PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election089a7ab9-8ca5-49c4-bf6d-064b6867fe42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election089a7ab9-8ca5-49c4-bf6d-064b6867fe42-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదిక‌లూ ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాయ‌ట‌. తిరుప‌తిలో ఈసారి గ‌త మెజార్టీ కూడా క‌ష్టమేన‌ని.. ఓడి పోయే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని నివేదిక‌లు ఇచ్చాయ‌ని తెలుస్తోందిTIRUPATI BY ELECTION;tiru;jagan;mp;tirupati;loksabha;assembly;husband;tdp;ycp;party;mantraజగన్ ను తిరుపతి భయపెడుతుందా?జగన్ ను తిరుపతి భయపెడుతుందా?TIRUPATI BY ELECTION;tiru;jagan;mp;tirupati;loksabha;assembly;husband;tdp;ycp;party;mantraFri, 09 Apr 2021 20:05:10 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఐదు లక్షల మెజారిటీ గెలుస్తామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ఐదు లక్షల మెజార్టీ రావాలని వైసీపీ నేతలకు జగన్ టార్గెట్ పెట్టారని ప్రచారం జరిగింది. తిరుపతి ఎన్నికలో తమకు పోటీనే ఉండదని భావించిన వైసీపీ.. బడా టార్గెట్ పెట్టుకుందని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం తిరుపతిలో సీన్ మారిందంటున్నారు. ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందనే సంకేతాలు అందడం వల్లే జగన్ తిరుపతిలో ప్రచారానికి వస్తున్నారని తెలుస్తోంది. వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. అందుకే, తొలిసారి జ‌గ‌న్ సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14న తిరుప‌తిలో ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు.

తిరుపతిలో అధికార పార్టీకి అభ్యర్థి మైనస్ గా మారారని అంటున్నారు. అభ్య‌ర్థుల ప‌రంగా  అంద‌రికంటే బ‌ల‌హీన‌ంగా కనిపిస్తున్నారు  గురుమూర్తి.  జ‌గ‌న్ కాళ్ల‌కు మ‌సాజ్ చేసినంత ఈజీ కాదు ఓట‌ర్ల‌ను మేనేజ్ చేయ‌డం. ఎవ‌రేమిటో వారికి బాగా తెలుసు. మాజీ ఎంపీ టీడీపీ అభ్య‌ర్థి పిన‌బాక ల‌క్ష్మి సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం డిల్లీలో గ‌ట్టిగా పోరాడిన నేత. అలాంటి స్ట్రాంగ్ లీడ‌ర్ మ‌ళ్లీ తిరుప‌తి ఎంపీ బ‌రిలో నిలిచారు. ఆమె గెలుపు కోసం టీడీపీ శ్రేణులు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. పనబాక ల‌క్ష్మి ముందు వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి చాలా వీక్ కేండిడేట్‌గా తిరుప‌తివాసులు భావిస్తున్నారు.  వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌తిష్ట బాగా దిగ‌జారుతోంది. ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ప‌డటం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో.. గురుమూర్తికి గెలిచే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయని అంటున్నారు.

తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదిక‌లూ ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాయ‌ట‌. తిరుప‌తిలో ఈసారి గ‌త మెజార్టీ కూడా క‌ష్టమేన‌ని.. ఓడి పోయే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని నివేదిక‌లు ఇచ్చాయ‌ని తెలుస్తోంది. దీంతో.. న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా సీఎం జ‌గ‌న్ తానే స్వ‌యంగా తిరుప‌తిలో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ నెల 14న తిరుప‌తి ప్ర‌చార బ‌రిలో దిగ‌బోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం జనంలోకి వెళ్లనున్నారు. ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన‌ ఎలాంటి ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేయ‌లేదు. తిరుప‌తిలోనూ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించినా క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేక‌పోవ‌డంతో తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చార బ‌రిలో దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి సీఎం జ‌గ‌న్‌రెడ్డిది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ వైపు పవన్.. మరోవైపు ధనుష్.. మాములు రచ్చ కాదుగా..!!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>