MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips7f9c0981-d2f2-406e-aad2-a0a439441788-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips7f9c0981-d2f2-406e-aad2-a0a439441788-415x250-IndiaHerald.jpgలవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారం వరకే పరిమితం అవుతుందని అందరూ భావించినా దాన్ని నిజం చేస్తూ సినిమా యూనిట్ నిన్న రాత్రి ఆకస్మిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసు కేసులు దృష్టిలో పెట్టుకుని ఈ లవ్ స్టోరీ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు ప్రకటించారు.. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని డేట్ పtollywood gossips;sekhar;kamma;andhra pradesh;telangana;cinema;huzur nagar;love;press;love storyలవ్ స్టోరీ వాయిదా.. టెన్షన్ లో ఇతర నిర్మాతలు ?లవ్ స్టోరీ వాయిదా.. టెన్షన్ లో ఇతర నిర్మాతలు ?tollywood gossips;sekhar;kamma;andhra pradesh;telangana;cinema;huzur nagar;love;press;love storyFri, 09 Apr 2021 08:00:00 GMTలవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారం వరకే పరిమితం అవుతుందని అందరూ భావించినా దాన్ని నిజం చేస్తూ సినిమా యూనిట్ నిన్న రాత్రి ఆకస్మిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసు కేసులు దృష్టిలో పెట్టుకుని ఈ లవ్ స్టోరీ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు ప్రకటించారు.. 

మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని డేట్ ప్రకటించలేదు కానీ కరోనా పరిస్థితి చక్కబడ్డాక విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు మిగతా నిర్మాతలలో టెన్షన్ మొదలైంది.. నిజానికి దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ షాపులు సినిమా థియేటర్ల విషయంలో ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

దీంతో వీలైనంత త్వరలో మళ్లీ థియేటర్లకి 50 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమాచారం ముందుగా అందడంతోనే లవ్ స్టోరీ సినిమా వాయిదా వేశారు అనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతోంది. దీంతో ఈ సినిమా తర్వాత రిలీజ్ చేయాలని భావిస్తున్న మిగతా నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. తాము సినిమా రిలీజ్ చేయాలా ? లేక వాయిదా వేసుకోవాలా అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. సినిమా థియేటర్స్ ఉన్న ఏషియన్ వాళ్ళే సినిమాలు వాయిదా వేస్తే మా పరిస్థితి ఏమిటి ? అనే టెన్షన్ వారిలో ఉందని అంటున్నారు. 

 




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండు జోన్లలోనే 409 మందికి కరోనా.. హైదరాబాద్ లో కల్లోలం

వకీల్ సాబ్ మ్యానియాకు మహేష్ సహకారం !

వ‌కీల్‌సాబ్‌కు తొలి రోజే ఎదురు దెబ్బ...!

వకీల్ సాబ్ : వకీల్ సాబ్ సినిమా చివరకు ఇలా నిలిచింది..!

వ‌కీల్‌సాబ్ హైద‌రాబాద్‌లో రికార్డు షోలు

వకీల్ సాబ్ : యూఎస్ఏ కూడా పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!

వకీల్‌సాబ్ సినిమా గురించి ఆలియాభట్ ఏం చెప్పారంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>