PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-mp-raghuramakrishnamraju5fb501d5-7fec-4d7c-bed7-5675d80ddff2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-mp-raghuramakrishnamraju5fb501d5-7fec-4d7c-bed7-5675d80ddff2-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో నిందితుడైన వ్య‌క్తిని క‌లిశారా? తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో భేటీ అయ్యారా? ఎవ‌ర‌త‌ను? ఎక్క‌డివాడు? జ‌గ‌న్‌కు ఎలా ప‌రిచ‌యం? అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున న‌ర‌సాపురం ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు తాజాగా ఒక అస్త్రాన్ని సంధించారు. త‌రుచుగా వైసీపీపై, జ‌గ‌న్‌పై, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న ర‌ఘురామ త‌న బాబాయycp, jagan, mp, raghuramakrishnamraju;raghu;ramakrishna;tiru;hyderabad;y. s. rajasekhara reddy;congress;mp;smart phone;central government;nijam;partyవైఎస్ జ‌గ‌న్ క‌లిసిన వివేకా హ‌త్య‌కేసు నిందితుడెవ‌రు?వైఎస్ జ‌గ‌న్ క‌లిసిన వివేకా హ‌త్య‌కేసు నిందితుడెవ‌రు?ycp, jagan, mp, raghuramakrishnamraju;raghu;ramakrishna;tiru;hyderabad;y. s. rajasekhara reddy;congress;mp;smart phone;central government;nijam;partyFri, 09 Apr 2021 17:41:56 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో నిందితుడైన వ్య‌క్తిని క‌లిశారా?  తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో భేటీ అయ్యారా? ఎవ‌ర‌త‌ను? ఎక్క‌డివాడు? జ‌గ‌న్‌కు ఎలా ప‌రిచ‌యం? అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున న‌ర‌సాపురం ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు తాజాగా ఒక అస్త్రాన్ని సంధించారు. త‌రుచుగా వైసీపీపై, జ‌గ‌న్‌పై, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న ర‌ఘురామ త‌న బాబాయ్ హ‌త్య‌కేసులో నిందితుడైన వ్య‌క్తిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌లిశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. రెండు సంవ‌త్స‌రాల క్రితం వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే.

మీరు క‌లిశారా?  లేదా?
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో న‌మోదై ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి గురువారం ఉదయం 10.46 గంటల సమయానికి తాడేపల్లిలోని జ‌గ‌న్ నివాసంలో ఆయ‌నతో భేటీ అయ్యార‌నేది ర‌ఘురామ వాద‌న‌. దానికి ముందురోజు కూడా ముఖ్య‌మంత్రి త‌న చిన్నానాటి స్నేహితుడు ఒక‌ర్ని క‌లిసిన‌ట్లు చెప్పారు. ప‌ని ఒత్తిడితో బిజీగా ఉంటున్నానంటూ కేసుల విచార‌ణ‌కు హాజ‌ర‌వ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని, మ‌రి వీరిని క‌ల‌వ‌డానికి స‌మ‌యం ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌ని ఎంపీ ప్ర‌శ్నించారు. తాను చేసే ఆరోప‌ణ‌ల‌కు ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ స‌మాధానం ఇవ్వ‌డంలేద‌ని, అంటే ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మేన‌ని అర్థం చేసుకోవాల‌న్నారు.

ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేది?
తనను బెదిరిస్తున్నవారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు.. ఐబీకి ఇచ్చేసినట్లు ఎంపీ వెల్ల‌డించారు.  తాను ఢిల్లీలో ఉన్నా,  హైదరాబాద్ లో ఉన్నా బెదిరింపు కాల్స్ ను అధికారులు రికార్డు చేస్తుంటార‌ని, ఇటువంటివారిని ర‌క్షించే అవ‌కాశం ముఖ్య‌మంత్రికి లేద‌న్నారు. జ‌గ‌న్‌రెడ్డికి ఉన్న చిన్న‌నాటి స్నేహితులే ఇటువంటి ప‌నులు చేస్తారంటూ ప‌రోక్షంగా అర్థం వ‌చ్చేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడిన మాట‌లు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. సొంత పార్టీ ఎంపీ ఆరోపిస్తున్న‌ట్లుగానే నిజంగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి త‌న బాబాయ్ హ‌త్య‌కేసులో నిందితుడైన వ్య‌క్తిని క‌లిశారా?  దానికి ముందురోజు త‌న చిన్న‌నాటి స్నేహితుణ్ని క‌లిశారా? అనే ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పేవారు లేక‌పోవ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల వైచిత్రికి అర్థం ప‌డుతోంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టిన జగన్..??

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>