Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/vijayshanthid68036cd-1707-48e8-9558-36b93a7d4b31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/vijayshanthid68036cd-1707-48e8-9558-36b93a7d4b31-415x250-IndiaHerald.jpg తెలంగాణలో ప్రయివేటు టీచర్ల దుస్థితిపై రాష్ట్ర బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు టీచర్లు నానా అవస్థలు పడుతున్నారని, కానీ వారి గోడు సర్కారుకు పట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వారికోసం ప్రభుత్వం ప్రకటించిన సాయంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే అది పెద్ద సాయమని, నిజానికి కష్టాల్లో ఉన్నవారికి ..vijayshanthi;vijayashanti;jeevitha rajaseskhar;bharatiya janata party;october;mantraప్రయివేటు టీచర్ల బాధలు పట్టించుకోని సర్కార్: విజయశాంతిప్రయివేటు టీచర్ల బాధలు పట్టించుకోని సర్కార్: విజయశాంతిvijayshanthi;vijayashanti;jeevitha rajaseskhar;bharatiya janata party;october;mantraFri, 09 Apr 2021 21:58:25 GMT
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ప్రయివేటు టీచర్ల దుస్థితిపై రాష్ట్ర బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు టీచర్లు నానా అవస్థలు పడుతున్నారని, కానీ వారి గోడు సర్కారుకు పట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వారికోసం ప్రభుత్వం ప్రకటించిన సాయంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే అది పెద్ద సాయమని, నిజానికి కష్టాల్లో ఉన్నవారికి అది ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో.. 'గత ఆరేడు నెలలుగా ప్రయివేటు టీచర్ల జీవితం అత్యంత దారుణంగా దిగజారిపోయింది. వరుస ఆత్మహత్యలు, పాలకుల పట్టింపులేనితనంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర సర్కారు వారికి రూ.2 వేలు డబ్బు, 25 కిలోల బియ్యం సాయంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల వల్ల కిందటేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 30 మంది ప్రయివేటు టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.

మరెందరో ఉద్యోగాలు కోల్పోయి నేటికీ బండ్లు నడుపుకుంటూ, కూరలమ్ముకుంటూ, కూలీలుగా ఇలా బతుకు గడవడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల మార్గాలు వెదుక్కుంటున్నారు. ఈ పరిస్థితులపై మీడియాలో మొదటి నుంచీ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే సర్కారు మేల్కొని వారికి అండగా పాలకులు ఉన్నారనే భరోసా కాస్తయినా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు.

ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరిచ్చే 2 వేలు ఆ కుటుంబాలకు ఏమూలకు సరిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ టీచర్లయినా, ప్రయివేటు టీచర్లయినా సమాజంలో గురువు స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదేనని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. కేవలం కాస్త డబ్బు, బియ్యం ఇస్తే వారి కన్నీరు ఆగదు. టీచర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించినప్పుడే వారికి నిజమైన సంతృప్తి. సర్కారు ఈ దిశగా ప్రయత్నించాలి' అని పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పార్టీ ప్రకటనకు బ్రేక్..జూలై 8న ప్రకటిస్తానన్న షర్మిల..!

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>